ప్రతి పల్లె అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం.......... గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం

Published: Friday December 23, 2022
ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం అశ్వాపురం మండలంలోని కళ్యాణపురం, గోపాలపురం, అను శక్తి నగర్, జగ్గారం, అశ్వాపురం, తురుమల గూడెం, గొందిగూడెం, గొందిగూడెం కొత్తూరు, ఎలకలగూడెం, రామవరం, వెంకటాపురం, చింతిర్యాల కాలనీ, సండ్రల బోడు, గొల్లగూడెం గ్రామాలలో, సుమారు మొత్తం కోటి 20 లక్షల విలువ గల సీసీ రోడ్లు నిర్మాణాలను, ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీ రేగా కాంతారావు  చేపట్టారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు  మాట్లాడుతూ
 గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని అన్నారు, ప్రతిపల్లె అభివృద్ధి లక్ష్యమని ఆయన అన్నారు, సీఎం కేసీఆర్ గారు పల్లె ప్రగతి తో గ్రామాల అభివృద్ధి చేయడం జరుగుతున్నదని, గ్రామ గ్రామాన వైకుంఠధామాలు ప్రభుత్వ మంజూరు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు అని అన్నారు., ప్రజలకు ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని  వారు అన్నారు, గ్రామాలలో మౌలిక సదుపాయాలు కల్పనకు తన వంతు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తున్నదని వారు  అన్నారు.అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని పేర్కొన్నారు. గ్రామపంచాయతీలా అభివృద్ధి కోసం అధిక మొత్తంలో నిధులు మంజూరు చేస్తున్నదని, గ్రామాలలో గతంలో అడుగంటిన చెరువులన్నీ ప్రస్తుతం జలకలతో దర్శనమిస్తున్నయని, అనేక గ్రామాలలోనూ ఇంటింటికి మిషన్ భగీరథ పథకం ద్వారా స్వచ్ఛమైన త్రాగునీరు అందుతున్నాయని , ప్రతి పల్లెకు పక్క రోడ్డు ను నిర్మించాలని సంకల్పంతో ప్రభుత్వం పని చేస్తుందని, గ్రామాల్లోనూ మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని, , రైతులకు పంట పెట్టుబడి సహాయం చేయాలనే దృఢ సంకల్పంతో రైతుబంధు, రైతు బీమా, వంటి పథకాలను సీఎం కేసీఆర్  రూపకల్పన చేశారని అన్నారు., ఈ రెండు పథకాలు దేశానికి దిక్సూచిగా మారాయని వారు తెలిపారు, పేదింటి ఆడబిడ్డల పెండ్లి కోసం కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల ద్వారా రూ.1,00,116 మేనమామ కట్నంగా ప్రభుత్వం అందజేస్తుందని చెప్పారు, నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థికంగా భరోసా కల్పిస్తుందని , పినపాక నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడిపించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నామని వారు తెలిపారు, నియోజకవర్గ అభివృద్ధిలో భాగ్యస్వామ్యం కావాలని ఈ సందర్భంగా వారు అన్నారు.