ఎన్కతాల గ్రామంలోని బావులపై జాలీలు ఏర్పాటు చేయాలి

Published: Wednesday December 01, 2021
వికారాబాద్ బ్యూరో 30 నవంబర్ ప్రజాపాలన : గ్రామంలోని బావులపై ఇనుప జాలీలు ఏర్పాటు చేయాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సూచించారు. మంగళవారం వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మీతో నేను కార్యక్రమంలో భాగంగా మోమిన్ పేట్ మండల పరిధిలోని ఎన్కతల గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దబ్బని వెంకట్ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ బొడ్డు అలవేలమ్మతో కలిసి గల్లీ గల్లీ తిరిగి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామ పంచాయతీ పరిధిలోని పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషికి నిదర్శనమే ఈ పల్లె ప్రకృతి వనాలన్నారు. గ్రామంలోని బావులపై పూర్తి స్థాయిలో పై కప్పులు ఏర్పాటు చేయాలని పంచాయతి కార్యదర్శిని ఆదేశించారు. ఒకటో వార్డులో మిషన్ భగీరథ నీటి సమస్య ఎక్కువగా ఉందని, వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. వీధి దీపాలకు ఆన్/ఆఫ్ కోసం ప్రత్యేకంగా వ్యవస్థ ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో నీటి వసతి, కాంపౌండ్ వాల్ నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. విద్యుత్ మరియు మిషన్ భగీరథ నీటి కనెక్షన్ వెంటనే ఇవ్వాలన్నారు. కరోనా వ్యాక్సిన్ తీసుకోని వారు కచ్చితంగా వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. గ్రామంలోని శానిటేషన్ పనులు చక్కగా చేపడుతున్నారని కితాబిచ్చారు. ఈ కార్యక్రమంలో మోమిన్పేట్ టిఆర్ఎస్ పార్టీ మండల మాజీ అధ్యక్షుడు నాసన్ పల్లి నరసింహారెడ్డ, మోమిన్పేట్ పిఎసిఎస్ చైర్మన్ బండ విష్ణువర్ధన్రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు కార్యకర్తలు, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.