కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

Published: Friday April 23, 2021

మంచిర్యల జిల్లా ప్రతినిధి, ఏప్రిల్22, ప్రజాపాలన : మంచిర్యాల జిల్లా కేంద్రంలో జోనల్ వ్యవస్థ ఆమోదం పొందిన సందర్భంగా పట్టణంలో ఐబి గెస్ట్ హౌస్ వద్ద టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో గురువారం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్వి నియోజకవర్గ ఉపాధ్యక్షులు దగ్గుల మధు కుమార్ మాట్లాడుతూ దశాబ్దాలుగా తెలంగాణా యువత చిరకాల కోరిక స్థానికులకు ఉద్యోగాలు దక్కాలని ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది. 1969 ఉద్యమం ఉద్యోగాలకోసం, అదేవిధంగా 2001 నుండి మన ఉద్యమ నేత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం లో తెలంగాణా ఉద్యమం జరిగి తెలంగాణ రాష్ట్రం సాకారమైందని పేర్కొన్నారు.  ముఖ్యమంత్రి  స్థానికులకే ఉద్యోగాలు దక్కాలని ఉద్దేశంతో 7 జోన్లుగా విభజించారని, అదేవిధంగా రెండు మల్టీ జోన్లుగా విభజించి దీనిద్వారా 95 శాతం స్థానికులకే ఉద్యోగాలు దక్కేలా చర్యలు తీసుకున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్రంలోని యువతకు స్థానిక ఉద్యోగాల కల్పన జరిగేలా కృషి చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి తెలంగాణ విద్యార్థులు, యువత పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం... ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్వి పట్టణ ఉపాధ్యక్షుడు చిప్పకుర్తి జగన్ టిఆర్ఎస్వి నియోజకవర్గ నాయకులు మహమ్మద్ సాజిద్ చోటు కంపెల్లీ అరుణ్ నక్క తిరుపతి సంజయ్ అంజత్ ఖాన్ శివ నాని శ్రీనాథ్ చిట్టి బాబు రఘు మహేశ్ మహేందర్ తదితరులు విద్యార్ధి నాయకులు పాల్గొన్నారు