పూర్వ విద్యార్థి సంఘం వారి సేవలు అభినందనీయం జడ్పీ చైర్మన్.

Published: Monday February 13, 2023
మధిర ఫిబ్రవరి 12 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం నాడు పూర్వ విద్యార్థుల సంఘం వారి ఆధ్వర్యంలోఎంతోమంది పేద విద్యార్థులకు అండగా నిలిచిన తేళ్ల వసంతయ్య స్మారక పాఠశాల పూర్వ విద్యార్థులుతేళ్ల వసంతయ్య స్మారక ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థి సంఘం వార్షిక సమ్మేళనంలో *జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు మున్సిపాలిటీ పరిధిలో ప్రధాన వీధిలో ఉన్న తేళ్ల వసంతయ్య ప్రభుత్వ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో చేసే సేవ కార్యక్రమాలు అభినందనీయం అని జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు పేర్కొన్నారు  ఆదివారం నాడు పాఠశాల ఆవరణలో జరిగిన పూర్వ విద్యార్థి సంఘం వార్షిక సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అందులో భాగంగా ముందుగా దివంగత తేళ్ల వసంతయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం జరిగిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఎంతోమంది పేద విద్యార్థులకు పూర్వ విద్యార్థి సంఘం వారు అండగా నిలిచారని గుర్తు చేశారు అలానే ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారని వారి సేవలను కొనియాడారు కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, పూర్వ విద్యార్థి సంఘం సభ్యులు ఎం నాగేశ్వరావు కృష్ణ ప్రసాద్ శ్రీధర్ శశి కుమార్ కోన జనార్ధన్ వాసిరెడ్డి రామనాథం బాబుల కనుమూరు వెంకటేశ్వరరావు సొసైటీ అధ్యక్షులు కృష్ణ ప్రసాద్ వార్డ్ కౌన్సిలర్ వంకాయలపాటి నాగేశ్వరావు మక్కిన నాగేశ్వరరావు పలువురు పూర్వ విద్యార్థుల సంఘం సభ్యులు పాల్గొన్నారు