వ్యవసాయ అధికారి శ్రీనివాసులు ఆధ్వర్యంలో వరి విత్తనాలు వేయటం జరిగింది

Published: Friday July 30, 2021
మధిర, జులై 29, ప్రజాపాలన ప్రతినిధి : మధిర రూరల్ఈ రోజు మల్లారం మరియు సిరిపురం గ్రామంలో వరివిత్తనాలను నేరుగా దమ్ములో వెదజల్లే పద్దతి మరియు డ్రమ్ సీడర్ పద్దతిలో సాగు చేసే వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించి, రైతులకు ఈ పద్ధతుల వలన పాటించవలసిన మెలుకువలు, తగు సూచనలను గురించి మండల వ్యవసాయ అధికారి DNK శ్రీనివాసరావు వివరించడం జరిగిందిసాంప్రదాయ వరి సాగులో నారు పోయడం, నాట్లు వేయడం మరియు కూలీల అవసరం కలదుకానీ వెదజల్లే పద్దతిలో కూలీ ఖర్చు, నారు ఖర్చు మరియు సమయాన్ని అధిగమించవచ్చు.. మన ప్రాంతానికి అనువైన వంగడాలు. దీర్ఘకాలిక రకాలు150 రోజులు సాంబ మసూరి, సిద్ధిమధ్య కాలిక రకాలు వరంగల్ సాంబ, వరంగల్ సన్నాలుస్వల్ప కాలిక రకాలు తెలంగాణ సోన RNR 15048 విత్తే సమయంజులై 10 లోపు విత్తనం చల్లుకోవాలివిత్తన మోతాదు సాంప్రదాయ పద్దతిలో ఎకరాకు 25 కేజీల విత్తనం అవసరం కానీ ఈ పద్దతిలో కేవలం 8 నుంచి 12 కేజీల విత్తనం సరిపోతుంది. ఈ విధానంలో విత్తన ఖర్చు తగ్గించవచ్చు.. విత్తన శుద్ధి ప్రాముఖ్యత మరియు అనుసరించే విధానం.
విత్తన శుద్ధి తో నేల ద్వారా సంక్రమించే తెగుళ్లను, చీడపీడలను నిరోధించడమే కాకుండా మొలకశాతాన్ని పెంచవచ్చు అదేవిధంగా లీటర్ నీటికీ 1గ్రా కార్బండిజమ్ కలిపి ఆ మిశ్రమంలో విత్తనాన్ని ఉంచి 24 గంటలు మండే కట్టి ఆ తరువాత విత్తనం ముక్కు పగలగానే దమ్ము చేసిన వరి పొలంలో చల్లాలి. ఎరువుల యాజమాన్యం సాధారణంగా నత్రజని ఎరువులను దమ్ములో, పిలక దశ లో, చిరుపొట్ట దశలో వేసుకోవాలి. భాస్వర ఎరువులను మొత్తం దమ్ములో వేయాలి. పోటాష్ ఎరువులను దమ్ములో సగం, అంకురం దశలో మిగతా సగం వేయాలి. ఎకరాకు 60-20-16 కేజీల N-P-K వాడవలసి ఉంటుందికలుపు యాజమాన్యం. ప్రధాన పొలంలో విత్తనాన్ని జల్లిన వెంటనే 1 నుంచి 2 రోజుల వ్యవధిలో పైరజోసల్ఫయురాన్ 80గ్రా 200 లీటర్ నీటిలో కలిపి ఎకరాకు పిచికారీ చేయడం ద్వారా కలుపు సమస్యను అధిగమించవచ్చు. 15 నుంచి 20 వ్యవధిలో గడ్డి జాతి కలుపు మొక్కల నివారణకు సైహలోఫాప్ బ్యుటైల్ 400 మిలీ ఎకరాకుపిచికాచేయాలి. నీటియాజమాన్యం. వరి పంటకు చిరుపొట్ట దశ నుంచి గింజ గట్టి పడే వరకు నీటి తడులుఇస్తూ ఉండాలి. సస్యరక్షణ. సాధారణంగా పిలక దశ లో కాండం తొలిచే పురుగు సమస్య వుంటుంది కావున వాటి నివారణ కు కోరాజిన్ 0.3 మిలీ/లీ నీటిలో కలిపి పిచికారీ చెయ్యాలి. సుడి దోమ నివారణ కు బ్యుప్రోఫ్యూసిన్ 600 మిలీ 200 లీ నీటిలో కలిపి ఎకరాకు పిచికారీ చెయ్యాలి. ఈ విధానంలో సాగు చేయడం ద్వారా రైతులకు సుమారు 7500 రూ వరకు ఖర్చు తగ్గుతుంది, నీటి వినియోగాన్ని 30-35% శాతాన్ని తగ్గించవచ్చు, 10 నుంచి 15  రోజుల ముందుగా పంట కోతకు వస్తుంది మరియు 5 నుంచి 8 శాతం అధిక దిగుబడులు సాధించవ ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి AODNK శ్రీనివాసరావు, వ్యవసాయ విస్తరణ అధికారి AEO వంశీ కృష్ణ సాయి, మల్లారం గ్రామ రైతు బంధు సమితి కోఆర్డినేటర్ మందడపు రామకృష్ణ, వేమిరెడ్డి లక్ష్మారెడ్డి మరియు రైతులు పాల్గొన్నారు.