ఎస్ఐఓ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

Published: Wednesday December 21, 2022
మన్నెగూడ ఎంపీటీసీ సయ్యద్ ఆదిల్ ఆహ్మద్
వికారాబాద్ బ్యూరో 20 డిసెంబర్ ప్రజా పాలన : స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా సేవలు అభినందనీయమని మన్నెగూడ ఎంపీటీసీ సయ్యద్ ఆదిల్ ఆహ్మద్ కొనియాడారు. మంగళవారం పరిగి నియోజకవర్గానికి చెందిన పూడూరు మండల పరిధిలోని మన్నెగూడలో ఎస్ఐఓ నూతన క్యాలెండర్ ను మన్నెగూడ ఎంపీటీసీ సయ్యద్ ఆదిల్ అహ్మద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మన్నెగూడ ఎంపీటీసీ మాట్లాడుతూ యువకులు సామాజిక సేవ కార్యక్రమాలలో ఎల్లప్పుడు ముందు ఉండాలని హితవు పలికారు. యువకులు సమాజానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఓ) వికారాబాద్ జిల్లా సభ్యులు మన్నెగూడ ఎంపీటీసీ సయ్యద్ ఆదిల్ ఆహ్మద్ చేతుల మీదుగా ఎస్.ఐ.ఓ నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ క్యాలెండర్లో తేదీలతో పాటు నైతిక విలువలు తెలియజేసే వాక్యాలు కూడా ఉన్నాయని స్పష్టం చేశారు. మానవుల మధ్య స్నేహ భావాన్ని, సోదరభావాన్ని పెంపొందించడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు..విద్యార్థులకు ఉన్నత విలువలు నెర్పాలన్నారు. ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని సూచించారు. క్రమశిక్షణతో సమాజానికి ఆదర్శంగా నిలవాలని స్పష్టం చేశారు..విద్యార్థులు, యువకులు సామాజిక సేవా దృక్పథంగా పనిచేస్తే మంచి సమాజాన్ని సృష్టించవచ్చని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమం లో జమాతే ఇస్లామి హింద్ వికారాబాద్ పట్టణ అధ్యక్షుడు మొహమ్మద్ ఫయాజుద్దిన్, ఎస్.ఐ.ఓ(SIO)జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ వాసే, ఎస్.ఐ.ఓ వికారాబాద్ యూనిట్ అధ్యక్షుడు మహమ్మద్ ముర్థాజా, మాజిత్ మరియు హకీమ్ తదితరులు పాల్గొన్నారు.