నూతన దంపతులను ఆశీర్వదించిన ఎంపీ నామా..

Published: Saturday February 25, 2023
కొణిజర్ల, ఫిబ్రవరి 24 (ప్రజా పాలన న్యూస్): ఖమ్మం పార్లమెంటు సభ్యులు నామ నాగేశ్వరరావు కొణిజర్ల మండలంలో పలు శుభకార్యాలలో శుక్రవారం హాజరయ్యారు. సింగరాయపాలెం గ్రామానికి చెందిన అద్దంకి గిరీష్ మనిషా నూతన దంపతులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు దొడ్డపనేని రామారావు, తాళ్లూరి చిన్న పుల్లయ్య, పొట్టపల్లి జీడయ్య, ఏలూరి శ్రీనివాసరావు, బాణాల వెంకటేశ్వరరావు, సుడా డైరెక్టర్ బండారు కృష్ణ, లకావత్ దేవేందర్ పాల్గొన్నారు.*