అమ్మ పాలు అమృతంతో సమానం

Published: Wednesday August 03, 2022

మధిర రూరల్ ఆగస్టు 2 ప్రజా పాలన ప్రతినిధి అమ్మ పాలు అమృతంతో సమానం అని మధిర ఐసిడిఎస్  11వ మినీ అంగన్వాడీ టీచర్ మరియు 11వ మెయిన్ అంగన్వాడి బొల్లెద్దు కుమారి మరియు విజయ్ కుమారి  పేర్కొన్నారు. తల్లిపాలు వారోత్సవాలు సందర్భంగా మంగళవారం మధిర సెక్టర్ వన్ పరిధిలోని 11వ మినీ మరియు మెయిన్ అంగన్వాడి సెంటర్ల టీచర్లు బుల్లెద్దు కుమారి విజయ కుమారి ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాలింతలు, గర్భిణీలు, చిన్నపిల్లల తల్లులకు తల్లిపాలన తాగించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరించారు. గర్భిణీలు  ప్రసవించిన వెంటనే బిడ్డకు ముర్రుపాలను పట్టించాలని, ముర్రుపాలు బిడ్డకు మొదటి టీకా లాంటివని వారు తెలిపారు. కనీసంగా బిడ్డకు తల్లిపాలను ఆరు నెలల పాటు పట్టించాలని, ఏడు నెలల నుండి మాత్రమే పిల్లలకు ఇతర ఘన పదార్థాలను అందిస్తూ రెండు సంవత్సరాల వరకు తల్లిపాలను అందించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గర్భిణీలు బాలింతలు, చిన్నపిల్లల తల్లులు తదితరులు పాల్గొన్నారు.