తొలి ఏకాదశి తెలుగు సాంప్రదాయంగా గోమాతను పూజించిన కాలనీవాసులు

Published: Monday July 11, 2022

 ఇబ్రహీంపట్నం జూలై తేదీ 10 ప్రజాపాలన ప్రతినిధి. 

జై గోమాత తొలి ఏకాదశి సందర్భంగా ఇబ్రహీంపట్నం బృందావన్ కాలనీలో గోమాత పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మహేశ్వరం బాగ్ సేవ కన్వీనర్ యంపల్ల సుధాకర్ రెడ్డి పాల్గొని కాలనీవాసులతో గోపూజ కార్యక్రమం చేయించడం జరిగింది రైతులు ఆవు మూత్రం పేడను ఉపయోగించి జీవామృతం గణామృతం తయారుచేసి వ్యవసాయానికి వాడినట్టయితే 30 ఎకరాల పొలము వ్యవసాయం చేయొచ్చు ఒక ఆవుతో అన్నారు అలాగే గో ఉత్పత్తులను ప్రతి ఒక్కరూ వాడాలన్నీ చెప్పడం జరిగింది  గోమాత గంగా మాత తులసీమాత భూమాత గీతామాత ఈ ఐదుగురు తల్లులను పంచమాతృకలు అంటారు వీరికి సదా మనం కృతజ్ఞతా భావంతో ఉండాలి ప్లాస్టిక్ వినియోగము పూర్తిగా నిషేధించాలి ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలు సముద్రాలతో సైతం 20 పేరుకుపోయాయన్నారు ఇదే విధంగా కొనసాగితే రానున్న కాలంలో చాలా విపత్తులు జరిగే అవకాశం ఉంది ప్లాస్టిక్ బదులు జ్యూట్ బ్యాగులు వాడాలని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు బృందావన్ కాలనీ పోచమ్మ గుడి మిటీ చైర్మన్ ఆకుల ఆనంద్ కుమార్ బృందావన్ కాలనీ వెల్ఫేర్ సొసైటీ చైర్మన్ ఉప్పల రామ్ రెడ్డి బుచ్చి రెడ్డి  భాస్కర్ సార్ సదానందం  సురేందర్ రెడ్డి ఆంజనేయులు నాగేందర్ రెడ్డి కిరణ్ ఇంకా పలువురు కాలనీవాసులు పాల్గొన్నారు.