ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి.

Published: Tuesday October 25, 2022
ప్రజాపాలన,  అక్టోబర్ 23,  శ్రీరాంపూర్:
 
 
తెలంగాణ రాష్ట్ర పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు  నిర్వహించిన పోలీసు విభాగంలోని వివిధ ఉద్యోగాల ప్రాథమిక వ్రాత పరీక్షలలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఇస్తున్న  ఉచిత శిక్షణ ను సద్వినియోగం చేసుకోవాలని శ్రీరాంపూర్ జియం పేర్కొన్నారు. ఆదివారం స్థానిక విలేకరులతో మాట్లాడారు.  శ్రీరాంపూర్ ఏరియా సింగరేణి ఉద్యోగుల ఎస్ టిపిపి ఉద్యోగుల మాజీ ఉద్యోగుల పిల్లలకు, స్థానిక భూ నిర్వాసిత, పరిసర గ్రామాల నిరుద్యోగ యువతీ యువకులకు పోలీస్ రిక్రూట్మెంట్ ర్యాలీలో పాల్గొని ఉద్యోగ అర్హత సాధించాలని అన్నారు.  సింగరేణి సేవా సమితి శ్రీరాంపూర్ ఏరియా ఆధ్వర్యంలో అనుభవజ్ఞులైన శిక్షకులచే శారీరక దారుఢ్య , వ్రాత పరీక్ష కొరకు శ్రీరాంపూర్ కాలనీ ప్రగతి మైదానంలో  ఉచిత శిక్షణ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.  మూడు నెలల పాటు నిర్వహించే ఈ శిక్షణ కేవలం పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ వారు నిర్వహించిన పోలీసు విభాగంలోని వివిధ ఉద్యోగాల ప్రిలిమినరీ పరీక్షలో క్వాలిఫై అయిన అభ్యర్థులకు మాత్రమే ఇవ్వబడుతుందని తెలిపారు.
 అర్హత సాధించిన అభ్యర్థులు తమ పూర్తి వివరాలతో పాటు దరఖాస్తులను ఈనెల 27 లోపు జనరల్ మేనేజర్ కార్యాలయంలోని పర్సనల్ డిపార్ట్మెంట్ నందు అందజేయాలని, దరఖాస్తులతో పాటు  వారి యొక్క ప్రిలిమినరీ పరీక్షలో క్వాలిఫై అయిన ధ్రువపత్రాలను జత చేసి  శ్రీరాంపూర్ జనరల్ మేనేజర్ కార్యాలయం పర్సనల్ విభాగంలో అందజేయగలరని తెలిపారు.
ఈ అవకాశాన్ని యువతీ యువకులు సద్వినియోగం చేసుకోగలరని కోరారు.