దహెగాం పోలీస్ స్టేషన్ ఆకస్మికంగా తనిఖీ ** జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ **

Published: Saturday September 17, 2022
ఆసిఫాబాద్ జిల్లా సెప్టెంబర్ 16 (ప్రజాపాలన, ప్రతినిధి) : జిల్లాలోని దహెగాం పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ కె సురేష్ కుమార్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ పోలీస్ స్టేషన్ రికార్డులు, రిసెప్షన్, లాకప్, మెయిన్ బ్యారక్, పరిసరాలను పరిశీలించి, పోలీసు సిబ్బందితో మాట్లాడి వారి విధులకు సంబంధించిన సూచనలు, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా సీఐ కి తగు సూచనలు తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని, అపరిచిత వ్యక్తులు వస్తే జాగ్రత్తగా ఉండే విధంగా ప్రజలను చైతన్య పరచాలని  సిబ్బందికి సూచించారు. మావోయిస్టుల వల్ల జరిగే నష్టాన్ని ప్రజలకు తెలియజేస్తూ, ప్రతి గ్రామంలో అవగాహన కార్యక్రమాలు  నిర్వహించాలని సూచించారు. ఆర్థిక నేరాలకు కట్టడి చేయడానికి కాలనీలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయుటకు ప్రజలకు వ్యాపారులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పి అచ్చేశ్వర్ రావు, కాగజ్నగర్ డి.ఎస్పి కరుణాకర్, సీఐ నాగరాజు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
 
 
 
Attachments area