గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి ** సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస

Published: Tuesday February 21, 2023
ఆసిఫాబాద్ జిల్లా ఫిబ్రవరి 20 (ప్రజాపాలన,ప్రతినిధి) :  ఆసిఫాబాద్ జిల్లాలోని వివిధ గ్రామపంచాయతీలో ఉద్యోగ కార్మికులు వివిధ కేటాగిరీలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ అన్నారు. సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలోని గ్రామపంచాయతీలలో పనిచేస్తున్న కరోబార్, బిల్ కలెక్టర్లకు, స్పెషల్ స్టేటస్. మల్టీ పర్పస్ వర్కర్ విధానం రద్దు చేసి, జీవో నెంబర్ 60 ప్రకారం పారిశుద్ధ కార్మికులకు రూ 15 వేల 600లు. కరోబార్ బిల్ కలెక్టర్లకు 19 వేల 500, కంప్యూటర్ ఆపరేటర్లకు 22,750 వేతనాలు. గత 4 నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలు తక్షణమే విడుదల చేయాలని, జీవో నెంబర్ 60 ప్రకారం మున్సిపల్ సిబ్బందికి చెల్లిస్తున్నట్లుగానే కార్మికులకు 16,500 బిల్ కలెక్టర్ లకు 15500 కంప్యూటర్ ఆపరేటర్లకు 22,700 వేతనాలు చెల్లించాలి అన్నారు. యాక్ట2/94 రద్దుచేసి పంచాయతీ సిబ్బంది అందర్నీ పర్మినెంట్ చేయాలనీ, కారోబార్ బిల్ కలెక్టర్లకు స్పెషల్ స్టేటస్ కల్పించాలి వారిని అసిస్టెంట్ కార్యదర్శులుగా నియమించి ప్రభుత్వ గ్రాండ్ ద్వారా వేతనాలు చెల్లించాలని, జీవో నెంబర్ 51 ను సవరించి, మట్టి పర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేయాలని,  కార్మికుడు కార్మికురాలు చనిపోతే వారి కుటుంబంలో వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని, పిఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా సౌకర్యాలు అమలు చేయాలని డిమాండ్  చేశారు. పోస్ట్ ఆఫీస్ ద్వారా ఇన్సూరెన్స్ ప్రభుత్వమే అమలు చేయాలని కార్మికులందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు. ఇళ్ల స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి 5 లక్షల 50 వేలు ఆర్థిక సాయం అందజేయాలన్నారు. దళిత బంధు పథకాన్ని పంచాయతీ సిబ్బందికి ప్రాధాన్యత ఇచ్చి అమలు చేయాలి. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు లోకేష్, రాజేందర్, మోరేశ్వర్ శ్రీకాంత్,  గ్రామపంచాయతీ నాయకులు శంకర్,  రాజు, సమ్మయ్య నగేష్ పుష్పలత రాణి మోతె లక్ష్మి బాలమ్మ అనిల్ రమేష్ చంద్రశేఖర్ వసంత్ రావు తదితరులు పాల్గొన్నారు.