ఘనంగా కార్డినల్ గ్రేసియస్ పాఠశాల 39వ వార్షికోత్సవ వేడుకలు

Published: Monday March 06, 2023
మేడిపల్లి, మార్చి 5 (ప్రజాపాలన ప్రతినిధి)
రామంతాపూర్ రాంశంకర్ నగర్లోని కార్డినల్ గ్రేసియస్ ఉన్నత పాఠశాల 39 వ వార్షికోత్సవ వేడుకలు "తరంగ్" పేరు తో  లింగారెడ్డి గార్డెన్స్ లో  ఘనంగా నిర్వహించారు. ఈ వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథులుగా ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్యతో పాటు మానవ విలువలను ఉపాధ్యాయులు బోధించాలని  సూచించారు. చదువు విషయంలో ఉపాధ్యాయులు విద్యార్థులను మందలిస్తే అది వారి మంచి కోసం అని తల్లిదండ్రులు గమనించాలే కానీ ఉపాద్యాలను నిలదీయటం మంచిది కాదన్నారు. అనంతరం పాఠశాల చైర్మన్ సాదుల మధుసూదన్ మాట్లాడుతూ జాతీయ విద్యా విధానం ప్రమాణాలను పాటిస్తూ విద్యార్థులకు వివిధ నైపుణ్యాలను కోడింగ్, ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ స్టీమ్, యోగ, డాన్స్ ఆర్ట్ మరియు క్రాఫ్ట్, మానవతా విలువలను మొదలగు విషయాలను పాఠశాల కర్రిక్యులంలో భాగంగా భోదిస్తున్నామన్నారు. విద్యార్థిని, విద్యార్థులు చేసిన అద్భుతమైన నృత్యరూపకాలు భారత దేశ సంస్కృతి సంప్రదాయాలను, దేశ భక్తి , సామజిక బాధత్యలు, జిహెచ్ఎంసి సిబ్బంది సేవలు మొదలగు ప్రదర్శనలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల అడ్మిన్ డైరెక్టర్ ధనలక్ష్మి అకాడమిక్ డైరెక్టర్ సవిత సాయి,  ప్రిన్సిపాల్ జ్యోత్స్నా, స్థానిక స్కూల్స్ కరెస్పాండెంట్స్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.