వాసవీక్లబ్స్ ఆధ్వర్యంలో వాసవీమాత ఆత్మార్పణ దినోత్సవం.

Published: Friday February 04, 2022
మంచిర్యాల బ్యూరో‌, ఫిబ్రవరి 03, ప్రజాపాలన: ఆర్యవైశ్యుల కులదేవత శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మర్పణ దినోత్సవం సందర్భంగా మంచిర్యాల వాసవీక్లబ్స్ ఆధ్వర్యంలో గురువారం వాసవీ మాత ఆలయంలో ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. వాసవీక్లబ్, వాసవీ వనితాక్లబ్, వాసవీ కపుల్స్ క్లబ్, వాసవీ యూత్ క్లబ్ లు సంయుక్తంగా వాసవీ మాత ఆలయంలో అమ్మవారికి ఓడిబియ్యం, చీర సమర్పించి ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఆలయ అర్చకులు వామనభట్ల బాలకృష్ణ శర్మ నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక్క రోజు వాసవీ దీక్షను నలభై మంది భక్తులు స్వీకరించారు. వారు బుధవారం సాయంత్రం వంచిర్యాల పట్టణంలో నగర సంకీర్తన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించి అనంతరం ఆలయ ప్రాంగణంలో భజన కార్యక్రమాన్ని చేపట్టారు. అదే విధంగా గురువారం సాయంత్రం వాసవీ మాత ఆలయంలో మహిళలు పెద్ద ఎత్తున అమ్మవారికి ప్రత్యేకంగా మంగళహారతులు నివేదించి అనంతరం వాసవీమాత పారాయణం, చాలీసా పారాయణం నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు రెండు రోజుల పాటు అన్నదాతలుగా రావుల శ్రీదేవి సత్యనారాయణ, ముక్తా వేణుగోపాల్, వుత్తూరి లలిత చంద్రశేఖర్ దంపతులు సహకరించారు. ఈ కార్యక్రమాలలో వాసవీక్లబ్ అంతర్జాతీయ ఉపాధ్యక్షులు ముక్తా శ్రీనివాస్, అంతర్జాతీయ ప్రోగ్రాం కో ఆర్డినేటర్ సిరిపురం శ్రీనివాస్, దొంతుల ముఖేష్, క్యాబినెట్ కోశాధికారి పూల్లూరి బాలమోహన్, వి కె ఎస్ పి జిల్లా ఇంచార్జి అప్పాల శ్రీధర్, రీజియన్ ఛైర్మన్ పుత్తూరి రమేష్, జోన్ ఛైర్మన్లు కాచం సతీష్, కొంకుముట్టి వెంకటేష్, నాగిశెట్టి జ్యోతి, వాసవీక్లబ్ అధ్యక్షులు కేశెట్టి వంశీకృష్ణ, కార్యదర్శి నలుమాసు ప్రవీణ్, కోశాధికారి మల్యాల శ్రీనివాస్, వాసవి వనిత క్లబ్ అధ్యక్షురాలు గౌరిశెట్టి ధనలక్ష్మి, కార్యదర్శి గంప వాసవి, కోశాధికారి కటకం సునీత, కపుల్స్ క్లబ్ అధ్యక్షులు గడ్డం రమాదేవి రమేష్, కోశాధికారి బజ్జురి శ్రీవాణి శ్రీనివాస్, యూత్ క్లబ్ అధ్యక్షుడు మల్యాల యోగేశ్వర్, కోశాధికారి బోనగిరి సాయి, వాసవి క్లబ్ నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.