వింటేజ్ సెంట్రల్ స్కూల్ లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

Published: Tuesday August 31, 2021
మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్ళపల్లి మంజుల రమేష్ 
వికారాబాద్ బ్యూరో 30 ఆగస్ట్ ప్రజాపాలన : శ్రీకృష్ణుని రూపం చామనఛాయయైనా మనసు మాత్రం వెన్న స్వభావం కలిగి దేనికీ భయపడని వ్యక్తిత్వమని వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్ళపల్లి మంజుల రమేష్ కొనియాడారు. సోమవారం మున్సిపల్ పరిధిలోని 24వ వార్డుకు చెందిన శివాజీ నగర్ లోని వింటేజ్ సెంట్రల్ స్కూల్ లో జరిగిన కృష్ణాష్టమి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చిన్నారులు గోపికలు, శ్రీ కృష్ణుడి వేషధారణలో అలరించారు. ఆటా పాటల నడుమ కృష్ణాష్టమి పండుగ ఘనంగా నిర్వహించారు. చిన్నారులతో కలిసి ఉట్టి కొట్టే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ నమ్మిన వారికి శ్రీ కృష్ణ భగవానుడు అండగా నిలిచాడని గుర్తు చేశారు. కృష్ణుడంటేనే అలౌకిక ఆనందానికి ప్రతిరూపమని పేర్కొన్నారు.  కృష్ణుడి పేరు తలుచుకుంటేనే జవసత్వాలు ఉట్టి పడతాయన్నారు. ఆయన చరితమే ఒక మానవ జీవన అనుభవసారమని వివరించారు. కృష్ణాష్టమి పర్వదినాన్ని చిన్నారుల మధ్య జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వింటేజ్ సెంట్రల్ స్కూల్ ప్రిన్సిపాల్ అనిత, స్థానిక కౌన్సిలర్ శ్రీదేవి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.