టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమం

Published: Monday June 13, 2022
మధిర జూన్ రూరల్ 13 ప్రజా పాలన ప్రతినిధి ఆదివారం నాడు
 మండలం కృష్ణాపురం గ్రామంలో ఆ గ్రామ శాఖ అధ్యక్షులు దేవభక్తిని వెంకట్ మరియు ఐ టి డి పి అధ్యక్షుడు అనుమోలు సతీష్  సమక్షంలో టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమం ముమ్మరంగా సాగింది. పార్టీ ఆవిర్భావం నుండి పార్టీ సభ్యత్వం కొనసాగిస్తున్న సీనియర్ నాయకులు కర్నాటి లింగయ్య, ప్రతిరోజు సభ్యత్వం కావాలని కోరుతున్నారు అని వారి ఇంటికి వెళ్లగా ఎంతో ఆప్యాయతగా వారిరువురు సభ్యత్వం తీసుకున్నారని,తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మార్నిడి పుల్లారావు,మధిర పట్టణ అధ్యక్షుడు మల్లాది హనుమంతరావు, కృష్ణాపురం గ్రామ శాఖ కార్యదర్శి తాతిన రాంబాబు , కర్ణాటి జయప్రకాష్ , కర్నాటి వీరభద్ర రావు, చావా శ్రీనివాసరావు, చెరుకూరి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.