దళిత బంధు లబ్ధిదారులతో ప్రభుత్వ విప్ఎమ్మెల్యే రేగా కాంతారావు ప్రత్యేక సమావేశం... దళితులు ఆర్

Published: Monday September 26, 2022

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం ప్రజా పాలన

దళిత బంధు పథకంతో ఆర్థికంగా ఎదగాలి... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు

ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ రేగా కాంతారావు గారు ఆదివారం నాడు పినపాక నియోజకవర్గం అన్ని మండలాల మొదటి విడత 100 మంది దళిత బంధు లబ్ధిదారులతో ప్రత్యేక సమావేశం అయ్యారు...

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు గారు మాట్లాడుతూ

సీఎం కేసీఆర్ గారి ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం దేశానికే ఆదర్శమని అన్నారు, నియోజవర్గంలోనీ వందమంది లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తున్నట్లు దళిత బంధు పథకంలో దళితులందరూ అభివృద్ధి చెందాలన్నారు, వారు ఎన్నుకున్న రంగాలలో మరింత ఉన్నది సాధించాలని వారి కుటుంబాలలో వెలుగులు నిండాలని ఆశిస్తున్నట్లు ఆకాంక్షించారు, సీఎం కేసీఆర్ గారు మానస ప్రతిక అయిన దళిత బంధు పథకం ద్వారా దళిత కుటుంబాలలో ఆర్థిక సామాజిక అసమానతలు రూపుమాపి వారి జీవితాలలో కొత్త వెలుగులు నింపిన వారు అవుతామని, వారి కాలిపై వారు సగర్వంగా తలెత్తుకొని జీవించేలా ఆర్థిక పరవృష్టి కలిగేలా ఈ పథకం తోడ్పడుతుందని, దళిత కుటుంబాల సంక్షేమానికి కట్టుబడిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్నారు, ఈ వంద మంది లబ్ధిదారులు భవిష్యత్తులో మిగతా వారికి ఆదర్శంగా నిలిచేలా ఉండాలని, పక్క ప్రణాళికతో యూనిట్లను నెలకొల్పి భావితరాలకు ఆదర్శంగా నిలవాలన్నారు, ఈ పథకంలో సద్వినియోగ పరుచుకోవాలని లబ్ధిదారులను గుర్తించి వారి కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా సహకరించాలని కోరారు, అదేవిధంగా వ్యాపారినిటీలను వివరించామని వారికి నచ్చిన యూనిట్లు నెలకొల్పి ఆర్థిక సామాజిక సాధికారత సాధించాలని అన్నారు, ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ గారికి, రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు గారికి లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు...