రైతుబంధుతో రైతుల ఇండ్లల్లో పండుగ వాతావరణం

Published: Monday January 10, 2022
వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ బ్యూరో 09 జనవరి ప్రజాపాలన : రైతుబంధుతో రైతుల ఇండ్లల్లో పండుగ వాతావరణం నెలకొందని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. ఆదివారం మర్పల్లి మండల పరిధిలోని పట్లూరు గ్రామంలో గ్రామ సర్పంచ్ దేవరదేశి ఇందిర అశోక్ అధ్యక్షతన మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నాదిరీగ శ్రీకాంత్ రెడ్డి, మండల రైతుబంధు అధ్యక్షుడు నాయబ్ గౌడ్, పట్లూరు రైతుబంధు అధ్యక్షుడు గొల్లముసలి అశోక్ ఆధ్వర్యంలో రైతుబంధు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి రైతు వేదిక వరకు 12 ఎడ్ల బండ్లతో డప్పు వాయిద్యాలు నృత్యాలతో కొనసాగిన ఊరేగింపులో ఎమ్మెల్యే తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రైతుల ఖాతాలలో రైతుబంధు డబ్బులు పడటంతో వారం రోజుల ముందే గ్రామ గ్రామాన సంక్రాంతి పండుగ వాతావరణం నెలకొన్నదని అన్నారు. పంటకు పెట్టుబడి సాయంగా 63 లక్షల కుటుంబాలకు రైతు బంధు పథకం ద్వారా ఇప్పటివరకు దఫాల వారీగా యాభై వేల కోట్లు రైతులకు అందించిన ఘనత కెసిఆర్ దని అన్నారు. రైతుభీమా, ఉచితకరెంటు, సాగునీరు, రైతుబంధు వంటి పథకాల అమలు కోసం అధిక మోతాదులో వ్యవసాయ రంగానికి ఖర్చుచేస్తున్న ఏకైక రాష్ట్రం  తెలంగాణ మాత్రమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి మధుకర్, ఎంపిపి భట్టు లలిత రమేష్, జిల్లా గ్రంథాలయం మాజీ చైర్మన్ కొండల్ రెడ్డి, మర్పల్లి సొసైటీ చైర్మన్ ప్రభాకర్ గుప్తా, రంగారెడ్డి జిల్లా ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షుడు రామేశ్వర్, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు, రైతులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.