కోటమర్పల్లి లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు పంపిణీ

Published: Thursday January 05, 2023
* వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ బ్యూరో 04 జనవరి ప్రజా పాలన : పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు పెద్దన్న పాత్ర పోషిస్తున్న సీఎం కేసీఆర్ అభినందనీయులని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ కొనియాడారు. బుధవారం మర్పల్లి మండల కేంద్రంలో కోటమర్పల్లి గ్రామానికి చెందిన ఏడుగురు లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను గ్రామ సర్పంచ్ విజయలక్ష్మి రాచయ్య ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. కావలినందిని పులిపిరి జ్యోతమ్మ బేగరి ఎల్లమ్మ డప్పు నరసమ్మ కావలి శ్రీలత చిట్టెంపల్లి నాగలక్ష్మి నేహా సుమేరాలకు లక్ష 116 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆడపిల్లల పెళ్లిళ్లు తల్లిదండ్రులకు భారము కారాదనే ఉద్దేశంతో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని సీఎం కేసీఆర్ పకడ్బందీగా అమలుపరుస్తున్నారని స్పష్టం చేశారు. కోట మర్పల్లి గ్రామ సర్పంచ్ విజయలక్ష్మి రాచయ్య మాట్లాడుతూ నేడు జరిగే పెళ్లిళ్లు పేదవారికి పెను భారంగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు కనిపెంచిన ఆడపిల్లల పెళ్లిళ్లు సంతోషంగా జరిగేందుకు సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం ఆర్థిక భరోసానిస్తుందని చెప్పడంలో సందేహం లేదని అన్నారు. ప్రజా సంక్షేమమే పరమావధిగా భావించి పాలిస్తున్న ఏకైక ప్రభుత్వం బిఆర్ఎస్ పార్టీ అని కొనియాడారు. మంచినీటి కొరకు మిషన్ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టి నల్లాలు‌, బావుల దగ్గర గొడవపడే బాధ తప్పిందన్నారు. మహిళల రక్షణ కొరకు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనమైన చరిత్ర కలిగిన పార్టీ బి ఆర్ ఎస్ అని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ చామల జైహింద్ రెడ్డి శ్రీశైలం గౌడ్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.