పాఠశాల మరుగుదొడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన

Published: Friday June 17, 2022
బోనకల్, జూన్ 16 ప్రజా పాలన ప్రతినిధి: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా మంజూరు అయిన 10 లక్షల 50 వేల రూపాయలతో నిర్మించనున్న మరుగుదొడ్లకు గ్రామ సర్పంచ్ భూక్య సైదా నాయక్ , ఎస్ఎంసి చైర్మన్ గుగులోతు నాగేశ్వరావు పాఠశాల సిబ్బంది గ్రామ పెద్దల సమక్షంలో శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎంసి చైర్మన్ నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉపాధి హామీ పథకాన్ని క్షేత్ర స్థాయిలో మౌలిక వసతులు కల్పించడానికి చేస్తున్న కృషి ఫలితంగానే దేశంలోని ప్రతి పాఠశాలలో ప్రతి గ్రామంలో జరిగే ప్రతి అభివృద్ధి పనులలో కేంద్ర ప్రభుత్వం నిధులను అందజేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ యార్లగడ్డ రాఘవ, వైస్ ఎంపీపీ గుగులోతు రమేష్, మాజీ సర్పంచ్ పోటు వెంకటేశ్వర్లు, బిజెపి మండల ప్రధాన కార్యదర్శి గంగులు నాగేశ్వరావు, మాజీ ఎస్ఎంసి చైర్మన్ మోర్ల నరసింహారావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రత్న కుమారి, పంచాయతీరాజ్ ఏఈ నవీన్ కుమార్, గ్రామ పంచాయతీ కార్యదర్శి దామళ్ళ కిరణ్ కుమార్, మాజీ వర్క్ ఇన్స్పెక్టర్, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.