కోరుట్ల యూత్ కాంగ్రెస్ అధ్వర్యంలో ఆమారుడైన దామెరా రాకేష్ కు సంతాపం

Published: Monday June 20, 2022

కోరుట్ల, జూన్ 19 ( ప్రజాపాలన ప్రతినిధి):
యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి ఆదేశానుసారం, కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గం ఇంచార్జి జువ్వాడి నర్సింగరావు పిలుపు మేరకు మరియు రాష్ట్ర పీసీసీ నాయకులు జువ్వాడి కృష్ణ రావ్ మరియు కోరుట్ల యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు ఏలేటి మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర  ప్రభుత్వం ప్రేవేశపెట్టిన అగ్నిపథ్ స్కీమ్ పై గత 3 ఏళ్ళుగా ఎదురు చూస్తున్న నిరుద్యోగులు అందరూ కలిసి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ స్టేషన్లో నిరసన తెలియజేస్తున్నాడగా పోలీస్ కాల్పులో ఆమారుడైన దామెరా రాకేష్ వరంగల్ వాసి మృతికి సంతాపంగా కోరుట్ల యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో  కోరుట్ల పట్టణంలోనీ కొత్త బస్టాండ్ సమీపంలో గల అంబేద్కర్  విగ్రహం దగ్గర మృతి చెందిన  దామెరా రాకేష్ ఫోటోలు ప్రదర్శిస్తూ  కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఏలేటి మహిపాల్ రెడ్డి  మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్మీ అగ్నిపథ్ వల్ల ఉద్యాగాలు ఇవ్వడం కాదు యువతను నిరుద్యోగులుగా మారుస్తుంది. సైన్యంలోకి తీసుకున్న వారిలో కేవలం 25% మందిని మాత్రమే రెగ్యులర్  చేస్తారు. మిగతా 75% మంది పరిస్థితి ఏమిటి? సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆర్మీ విద్యార్థులు నిరసన తెలుపుతున్న సమయంలో పోలీస్ తుటాలకు బలియైన దామెర రాకేష్ అమారుడైనడు. అయన కుటుంబాన్ని ఆదుకోవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉన్నది. వీరికి తక్షణమే కోటి రూపాయలు మరియు ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని యువజన కాంగ్రెస్ కోరుట్ల నియోజకవర్గం పక్షాన డిమాండ్ చేశారు.