వికారాబాద్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక

Published: Tuesday March 16, 2021
వికారాబాద్ జిల్లా ప్రతినిధి మార్చి 15 ( ప్రజాపాలన ): వికారాబాద్ జిల్లా పరిధిలోని విలేకరుల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా జిల్లా ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని విలేకరులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని రత్నా రెడ్డి గార్డెన్ లో ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకొనుటకు విలేకరులు సమావేశమయ్యారు.  వికారాబాద్ జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ఎమ్.రవీందర్ ( నవ తెలంగాణ ) ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆనంద్ ( సివిఆర్ ), జిల్లా ప్రధాన కార్యదర్శిగా కొత్తపల్లి శ్రీధర్ ( నినాదం ), ఉపాధ్యక్షులుగా రాజేష్ ( నమస్తే తెలంగాణ ) వెంకటరమణ ( దిశ ), రాఘవేందర్ ( సూర్య ), మహేందర్ (సాక్షి టివి ), ప్రధాన కార్యదర్శిగా కొత్యపల్లి శ్రీధర్ ( నినాదం ), సంయుక్త కార్యదర్శులుగా జావిద్ ( మున్సిఫ్ టివి ), మహేష్ ( ఆంధ్ర జ్యోతి ), జి.నర్సిములు ( టి న్యూస్ ),  షఫీ ( ఎన్ టివి ), కోశాధికారిగా జైదుపల్లి గోపాల్ ( మన తెలంగాణ ),  కార్యనిర్వాహక సభ్యులుగా ఎన్కతల రవీందర్  ( నమస్తే తెలంగాణ ), సత్యం ( ఏబిఎన్ టివి ), మురళి కృష్ణ ( ఈనాడు టివి), శేఖర్ (ఇండియా నౌ టివి), మాచన్నగారి గైబులు ముదిరాజ్ ( ప్రజాపాలన ), పి.చుక్కయ్య ( కలం నిఘా), డి.ఆనంద్ ( జ్యోతి), బి. రాజు ( ఏబి న్యూస్),  ప్రత్యేక పూర్తి స్థాయి ఆహ్వానితులుగా ఆర్ఎం గిరీశ్వరస్వామి ( ఆంధ్రజ్యోతి), మఠం వైద్యనాథ్ ( ఈనాడు), అల్లిపూర్ వెంకటేష్ (ఈనాడు), దామోదర్ రావు ( ఈనాడు), బాయి కాడి వెంకట్, ఊరడి మహేందర్, ప్యాట రవి, అమ్రాది నర్సింలు, శ్రీనివాస్, పట్లూర్ నరసింహులు, జే వైద్యనాథ్, ఎస్ రవీందర్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ మిత్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికై ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు. ఇళ్ల స్థలాల కేటాయింపు లో గాని, డబుల్ బెడ్ రూమ్ ల కేటాయింపులో గాని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడానికి ముందుంటామని అన్నారు. అదేవిధంగా జర్నలిస్టుల కుటుంబాలకు వైద్యపరంగా జర్నలిస్ట్ ల పిల్లలకు విద్య పరంగా ఈ సమస్యలను పరిష్కరించడానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ప్రవీణ్ చారి, జాకవెంకటేష్, రవిందర్, శంకర్, పి.అశొక్, జి.అశొక్, క్రిష్ణ, పాండు, దేవెందర్, ప్రమోద్, విజయ్, శివ క్రిష్ణ చారి తదితరులు పాల్గొన్నారు.