మధిర టిడిపి ఆధ్వర్యంలోఐలమ్మ 126వ జయంతి

Published: Monday September 27, 2021

మధిర, సెప్టెంబర్ 26, ప్రజాపాలన ప్రతినిధి : రాష్ట్రంప్రభుత్వం అధికారాయుతంగా జరుపుచున్న నేపథ్యంలో ఈరోజు  మధిర నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఐలమ్మ జయంతి ఉత్సవాన్ని పండుగలా జరిపిన తెలుగుదేశం శ్రేణులు ఈ సందర్భంగా జరిగిన సభా కార్యక్రమానికి మధిర అర్బన్ మండల టీడీపీ అధ్యక్షుడు మల్లాది హనుమంతరావు అధ్యక్షత వహించారు ముందుగా రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు డాక్టర్ వాసిరెడ్డి రామనాధం రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి చేకూరి శేఖరబాబు నాయకులు వంగాల రామకోటి మేడేపల్లి రాణి కోనేరు రాణి పగిడిపల్లి విజయమ్మ సట్టు వెంకటేశ్వరులు మాదాల నరసింహారావు తదితరులు మల్లెల వెంకయ్య ఖమ్మంపాటి పుల్లారావు తదితరులు ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు తదుపరి బలహీన వర్గాలకు పలు సేవాలందించుచున్న సట్టు వేంకటేశ్వరులను మల్లెల వెంకయ్యను ఖంమ్మంపాటి పుల్లారావును లంకా సత్యం మునగంటి సంగయ్య గౌరరాజు శ్రీనివాస్ నరసింహారాలను ఘనంగా సన్మానించారు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని స్వీట్స్ పంచుకొన్ని ఐలమ్మకు జే జే లు పలికారు ఇంకా రామనాధం ఇతర నాయకులు మాట్లాడుతూ ఐలమ్మ జీవిత ఘట్టాలు పోరాటాలు వారి వారి కుటుంబ సభ్యుల త్యాగాలు తత్ఫలితంగా నిజాం పరిపాలన దేశముఖ్ జాగీర్దారుల రజాకార్ల దౌష్ట్యాల నుండి విముక్తిపొంది నిజాం సంస్థానం కూలిపోయి స్వరాష్ట్రం ఏర్పాటుకు దోహదం చేసినదని తెలియజేసారు ఐలమ్మ తెలంగాణా రైతాంగ పోరాట స్పూర్తితోనే డిల్లీ సరిహద్దులలో ప్రధాని మోడీ తెచ్చిన నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ప్రస్తుత రైతాంగం పోరాడుతున్నదని వారు, ప్రతిపక్షాలు నిర్వహించుచున్న రేపటి బందలో పాల్గొని విజయవంతం చేయాలని తెలుగుదేశం నాయకులు పిలుపు నిచ్చారు. బడుగు బలహీన వర్గాల ఒత్తిడి, చైతన్యం, ఐలమ్మ పోరాట పటిమ, ఈటెల రాజేంద్ర రాజీనామా పుణ్యంతో ఐలమ్మ ఘన చరిత్రకు అధికారిక గుర్తింపు వచ్చిందని రామనాధం మాట్లాడుతూ అన్నారు పోరాడితే పోయేది సంకెళ్లే అని అమరురాలైన ఐలమ్మ నిరూపించినదని ఆమార్గంలోనే ఆస్పూర్తి తోనే పార్టీ శ్రేణులు రాష్ర్ట కేంద్ర ప్రభుత్వాలు తీసుకొంటున్న ప్రజావ్యతిరేక నిర్ణయాలపై పోరాడాలని తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తేవాలని అదే ఐలమ్మకు ప్రజలు ఇచ్చే నిజమైన నివాళి అని రామనాధం అన్నారు