తూతక్క లింగన్నపేట గ్రామంలో విజయవంతమైన కంటి వైద్య శిబిరం

Published: Wednesday November 24, 2021
శిబిరాన్ని ప్రారంభించిన సర్పంచ్ బానోతు వీరభద్రరావు
ప్రజాపాలన ప్రతినిధి : లయన్ శ్రీ కాపా గోపాలరావు, శ్రీమతి అదిలక్మి వైరా లయన్స్ కంటి హాస్పిటల్, తూతక్క లింగన్నపేట గ్రామ సర్పంచ్ బానోతు వీరభద్రరావు ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద మంగళవారం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని సర్పంచ్ వీరభద్రరావు చేతులమీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇటువంటి కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించిన లయన్స్ క్లబ్ ప్రతినిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ వైద్య శిబిరంలో 92 మందికి ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో అవసరమైనవారికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేస్తామని లయన్స్ ఐ హాస్పిటల్ నిర్వాహుకులు ఉండ్రు శ్యాం బాబు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ పాశం శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి శివ, వేముల కృష్ణప్రసాద్, వార్డు మెంబర్లు, వైరా లయన్స్ కంటి హాస్పిటల్ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.