వీఆర్ఏల కు డీలర్ల అసోసియేషన్ సహాయ సహకారo ప్రజాపాలన కొడంగల్

Published: Tuesday August 23, 2022

 ప్రతినిధి ఆగస్టు 22:కొడంగల్ మండల వీఆర్ఏ జేఏసీ పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా వీఆర్ఏలు 25 07 2022 నుండి నిరవధిక సమ్మె 29వ రోజుకు చేరుకుంది. కావున ఈరోజు కొడంగల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి రేషన్ డీలర్ల అసోసియేషన్ వారు కొడంగల్ మండల వీఆర్ఏలకు వారి వంతుగా 5000 రూపాయలు సహాయం చేయడం జరిగింది. కొడంగల్ మండల వీఆర్ఏలకు మా యొక్క సహాయ సహకారాలు ఎల్లప్పుడు ఉంటాయని తెలపడం జరిగింది. కావున కొడంగల్ మండల వీఆర్ఏలు డీలర్ల అసోసియేషన్ కు కో చైర్మన్ గోపాల్. శ్రీనివాస్. దండ్ల రమేష్ తోటి వీఆర్ఏలతో కలిసి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు