హాత్ సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమం కోసం కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం

Published: Wednesday January 11, 2023

కోరుట్ల, జనవరి 10 (ప్రజాపాలన ప్రతినిధి):
కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు  సూచన మేరకు హాత్ సే హాత్ జోడో అభియాన్  కార్యక్రమం నిర్వహణ కోసం కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో  సమీక్ష సమావేశం మంగళ వారం రోజున నిర్వహించారు.సమావేశంలో కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరుమల గంగాధర్  మాట్లాడుతూ హాత్ సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమంలో ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల స్థాయి నుండి బూత్ లెవల్ వరకు ప్రతి కార్యకర్త  కోరుట్లలోని వార్డ్ లోని ప్రతి గడప గడపకు వెళ్లి గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వున్నప్పుడు చేసిన అభివృద్ధి పనుల గురించి అందరికి తెలిసే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. ముఖ్యంగా వృద్ధులకు పెన్షన్ల విషయంలో ఉన్న అపోహను పోగొట్టాలని ఏ పార్టీ గెలిసిన వారి పెన్షన్లు వస్తాయని తెలియజేయాలని అన్నారు.అదే విధంగా రైతు సమస్యలపై కాంగ్రెస్ పార్టీ చేసిన, చేస్తున్న విషయాలను గ్రామంలోని ప్రతి రైతుకు వివరించాలని ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వరంగల్ డిక్లరేషన్ అమలు చేస్తామని ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తాం సవత్సరానికి ఆరు సిలిండర్లు ఉచితంగా ఇస్తాం  అని చెప్పిన రాహుల్ గాంధీ గారి మాటలను ప్రతీ రైతుకు మహిళలకు వివరించాలని అన్నారు.దేశం కోసం,దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ చేస్తున్న జోడో యాత్రని యాత్ర లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ సకల జనుల కోసం పోరాటం చేస్తుందని వాటి గురించి గ్రామాల్లో ప్రతి ఇంటికి తెలియజేయాలని అన్నారు.అదే విధంగా ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలోని రెండు ప్రభుత్వాలు పేద,మధ్య తరగతి ప్రజల మీద అవలంబిస్తున్న  తీరును ఎండగట్టాలని అన్నారు. పెరిగిన డీజిల్ ధరలు. గ్యాస్ ధరలు నిత్యా అవసర సరుకుల ధరలు వాటి గురించి అందరికి అవగాహన కల్పిచాలని అన్నారు. ఒక ఏడాది పాటు కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి  నాయకుడు నుండి ప్రతి కార్యకర్త పని చేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరుమల గంగాధర్ అన్నారు.ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ పట్టణ అధ్యక్షులు శ్రీరాముల అమరేందర్,పట్టణ ప్రధాన కార్యదర్శి బన్న రాజేష్, కార్యదర్శి మ్యాకల నర్సయ్య, సహాయ కార్యదర్శులు ఎంబేరి సత్యనారాయణ, చిటి మేల్లి రంజిత్, గుప్త , యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు రిజ్వాన్, జాగిలం భాస్కర్ , యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మ్యాదరి లక్ష్మణ్,నజ్జు , ముజిబిత్ ,ఎం డి ఇర్షాద్ ,తోడేటి శ్రావణ్ కుమార్ , సోషల్ మీడియా కోఆర్డినేటర్ వాసం అజయ్ , రాకేష్ తదితరులు పాల్గొన్నారు.