బెల్లంపల్లిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత.... అడ్డుకున్న స్థానికులు

Published: Tuesday September 07, 2021
బెల్లంపల్లి సెప్టెంబర్ 6 ప్రజాపాలన ప్రతినిధి : రాష్ట్ర ప్రభుత్వం పలు జిల్లాల్లో టి ఎస్ ఎస్ ఐ పాస్ ద్వారా పర్మిషన్ లేకుండా ప్రభుత్వ స్థలాల్లో నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని తీసుకున్న నిర్ణయం మేరకు గత వారం రోజల క్రితం బెల్లంపల్లి రైల్వే స్టేషన్ ఏరియాలో టాస్క్ ఫోర్స్ టీం కూల్చివేత లకు శ్రీకారం చుట్టగా స్థానిక మున్సిపల్ కౌన్సిలర్లు అడ్డుకొని ఆపడంతో అధికారులు వెనుతిరిగి రావడం జరిగింది. గత రెండు రోజుల క్రితం అమెరికాలో ఉంటున్న తోడే కృష్ణారెడ్డి అనే ఇంజనీర్ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కు ట్విట్టర్ ద్వారా కూల్చివేతలనీ అడ్డుకున్న బెల్లంపల్లి పట్టణ ప్రజాప్రతినిధులు అంటూ వివిధ పత్రికల్లో వచ్చిన వార్తలతో పాటు ఫిర్యాదు చేయగా ఆగిపోయిన కూల్చివేతల కార్యక్రమం కెటిఆర్ ఉత్తర్వులతో సోమవారం నాడు మళ్ళీ మొదలైంది. బెల్లంపల్లి పట్టణం లోని 170 పిపి ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా నిర్మించుకున్న నిర్మాణాలను కూల్చి వేయాలంటూ కొందరు కోర్టులకు వెళ్లగా కోర్టులు కూడా అక్రమ నిర్మాణాలను ఆపాలంటూ ఇచ్చిన ఉత్తర్వులను స్థానిక అధికారులు అమలు చేయకపోవడంతో అక్రమార్కులు అక్రమ నిర్మాణాలు చేపట్టడం అగ్నికి ఆజ్యం పోసినట్లు గా మారింది. కృష్ణా రెడ్డి ఫిర్యాదు మేరకు మున్సిపల్ శాఖ మంత్రి ప్రత్యేక ఉత్తర్వులు పంపించి బేషరతుగా అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని ఇచ్చిన ఉత్తర్వుల మేరకు సోమవారం నాడు పట్టణంలోని ఏరియా హాస్పిటల్ ముందుగల టకారియా నగర్ లో నిర్మించిన సిసి బిల్డింగును కూల్చివేయడానికి స్థానిక టాస్క్ఫోర్స్ సిబ్బంది జెసిబి తో రాగా స్థానికులు అడ్డు తగిలి అడ్డుకున్న పోలీసుల సహాయంతో కూల్చివేతను కొనసాగించారు. 11 పిల్లలతో నిర్మించిన సి సి బిల్లింగ్ లో రెండు పిల్లర్లను ఇటుక గోడలను ను కూల్చివేయగా మిగతా 9 పిల్లర్లు అలాగే ఉండిపోయాయి, కూల్చివేత అయిపోయిందని నిర్ణయించుకున్న అధికారులు అక్కడి నుండి వెళ్ళి పోవడం పలు విమర్శలకు తావిస్తోంది అధికారులు చిత్తశుద్ధితో ప్రభుత్వ ఉత్తర్వులను అమలు చేయడం లేదని ఏదో కూల్చి నాము అంటే కూల్చినాం అన్నట్లు గా మొక్కుబడిగా కూల్చి  పై అధికారులకు ఫోటోలు చూపిస్తున్నారే తప్ప ఈ కూల్చివేతలు తూతూ మంత్రంగానే నడుస్తున్నాయని స్థానికులు అంటున్నారు. ఏది ఏమైనా ఈ అక్రమ నిర్మాణాల కూల్చివేతల కార్యక్రమం స్థానిక ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మెడకు ఉచ్చుగా తయారైంది, కూల్చివేతలు వద్దంటే ప్రభుత్వంతో ఇబ్బంది, కూల్చివేయమంటే అంటే ప్రజలతో ఇబ్బంది, ఇప్పటికే ఒక మహిళా నాయకురాలును ఫోన్లో తిట్టాడని విమర్శలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే ఏ విధమైన చర్యలకు పూనుకుంటాడో పట్టణ ప్రజలు వేచి చూడాల్సిందే.