అద్దె బస్సుల యజమానులు ఆవేదన

Published: Thursday June 24, 2021
బకాయి బిల్లు లు చెల్లించే వరకు బస్సులు నడపపలేము.మధిర డిపో మేనేజర్ వినతిపత్రం అందజేత.
మధిర ప్రజా ప్రతినిధి 23వ తేదీ మున్సిపాలిటీమధిర డిపోలో నడుపబడుచున్న 31 అద్దె బస్ ల బిల్స్ నాలుగు నెలలుగా TSRTC వారు బస్ యజమానులకు చెల్లించనందున ఫైనాన్స్ వారికి EMI లు కట్టలేక పోవడం వల్ల బస్ లను ఫైనాన్స్ వారు సీజ్ చేసే పరిస్థితులు రావడం మరియు డ్రైవర్ల జీతాలు చెల్లిచనందున వారు కూడా బస్ లను నడుపుటకు రాకపోవడంతో బస్ లను ఆయా రూట్లలో నడపలేమని మొత్తం అద్దె బకాయిలు చెల్లించేవరకు బస్ లను నడపలేమని రాష్ట్ర నాయకులు పి.రవి మరియు అద్దె బస్ యజమానులు భాస్కర్, రామకృష్ణ, అంకమరావు, నిఖిల్ కృష్ణ, హరీష్, పంతులు, వెంకటేశ్వర్లు, ఆధ్వర్యంలో మధిర డిపో మేనేజర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మా సమస్యలను త్వరగా పరిష్కరించి మా కుటుంబాలను రోడ్డున పడకుండా చూడాలని ప్రతి నెల బకాయిలు వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది.