వరి సాగులో నీటిని ఆదా చేసే పద్ధతులు

Published: Saturday March 11, 2023
* జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్
వికారాబాద్ బ్యూరో 10 మార్చి ప్రజాపాలన : వరి మొక్క జొన్న పంట పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించామని జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి సాగులో నీటిని ఆదా చేసే పద్ధతులు, కలుపు నివారణ చర్యల సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి జి అనిల్ కుమార్ గొట్టిముక్కల గ్రామ సర్పంచ్ పట్లే వెంకటేష్ , రైతుబంధు కోఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డి , జై దు పల్లి నర్సింలు ,వడ్ల నాగప్ప, కాసులస్వామి, సిద్ధగల్ల రవి, లాలప్ప రైతులు పాల్గొన్నారు. 
జైతుపల్లి నర్సింలు వరి పొలంలో వరివిత్తిన రోజు నుంచి కలుపు మందులు, వాడిన రసాయనిక ఎరువులు తెలుసుకొని విత్తిన 20 నుంచి 30 రోజుల మధ్యకాలంలో సైహలో పాప్ బ్యూటైల్ 400 మిల్లీలీటర్ల మందులు పిచికారి చేయాలి  వెడల్పాటి ఆకులు గల కలుపు నివారణకు 2-4డి  అని 400 మిల్లీలీటర్ల మందును పిచికారి చేయాలి లేదా బిస్ ఫైరిబ్యాక్ సోడియం అనే మందును ఎకరాకు 8 లీటర్లు పిచికారి చేసినట్లయితే కలుపు నివారించవచ్చు ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వరిలో అగ్గితెగులు సోకుటకు అనుకూలం తెగులు గమనించి నివారణకు 0.6 గ్రామ్స్ ట్రై సైక్లోజోల్ , లేదా 1.5mla ఐసో ప్రో తయోలిన్ లేదా 2.5 మిల్లీలీటర్ల కాసుగామైసిన్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి ప్రస్తుతం నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రత గల వలస వరిలో ఆకు నల్లి ఆశించి అవకాశం ఉన్నది నివారణకు ఐదు మిల్లీలీటర్ల డైకో ఫాల్ లేదా ఒక మిల్లీమీటర్ స్పైరో  మెసిపిన్ మందులు లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి
ప్రస్తుతం మొక్కజొన్న పంటలో  కత్తెర పురుగు నివారణకు 0.4 మిల్లీమీటర్లు క్లోరంట్రోని లిప్సోల్ 0.5 మిల్లీలీటర్ స్పైనటోరం లీట నీటికి కలిపి ఆకుల సుడులు తడిచేలా పిచికారి చేసుకుంటే భారీ నుండి పంటలు రక్షించుకో గ్రామాల రైతులకు వ్యవసాయ అధికారి గోపాల్  తెలియజేయడం జరిగింది.