అన్యాక్రాంతం అవుతున్న శిఖం భూములని కాపాడాలి* - ఐక్య విద్యార్థి సంఘాల డిమాండ్

Published: Wednesday January 18, 2023
మంచిర్యాల టౌన్, జనవరి 17, ప్రజాపాలన: నస్పూర్ మండల కేంద్రంలో కబ్జాకు గురవుతున్న ప్రభుత్వ భూములని, చెరువు శిఖం భూములని కబ్జాదారుల నుండి కాపాడాలని నస్పూర్ మండల     తహసీల్దార్ జ్యోతి కి ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ
మండలంలోని నస్పూర్ శివారు నందు సర్వే నెంబర్ల లో గల 64, 72 లో ఎకరాలకు ఎకరాలు ప్రైవేట్ రియల్ ఎస్టేట్ వ్యాపారులు విచ్చలవిడిగా కబ్జాలు చేస్తూ అక్రమ వెంచర్లు చేస్తూ కోట్ల రూపాయలు దండు కుంటున్నారని, ఇవి తెలియని ప్రజలు అమాయకంగా వ్యాపారుల మాటలు నమ్మి మోస పోతున్నారని అన్నారు.   కొత్త చెరువులోని సర్వే నెంబర్ 67 పూర్తిగా చెరువు శిఖం అయినప్పటికి అందులో కూడా వెంచర్ వేసి ప్లాట్ల కోసం హద్దురాలు పాతి దర్జాగా అమ్మకాలు చేస్తూ ప్రభుత్వ నిబంధనలకి, చట్టలకు తూట్లు పొడుస్తూ అమాయక ప్రజలని, ప్రభుత్వన్ని మోసం చేస్తున్నారు, సర్వే నెంబర్ 119లో రెండు ఎకరాలు ప్రభుత్వ ఐటిఐ కోసం బోర్డు పాతితే రియల్ ఎస్టేట్ వ్యాపారులు అట్టి బోర్డుని లేకుండా చేసి భూమిని కబ్జా చేయాలనీ చూస్తున్నారని ద్వజమేతారు. అధికారులు  ఇట్టి కబ్జాలపై వెంటనే స్పందించి కబ్జాదారుల పై కఠిన చర్యలు తీసుకోలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో 
ఐక్య విద్యార్థి సంఘాలు
చిప్పకుర్తి శ్రీనివాస్,బచ్చలి ప్రవీణ్ కుమార్,పూరెళ్ళ నితీష్ తదితరులు పాల్గొన్నారు.