నాయకుల నిర్లక్ష్యపు అవమానకర చర్యలే బాధిస్తున్నాయి

Published: Thursday March 18, 2021

మేము పార్టీకి రాజీనామా చేయలేదు : శీలం .వెంకట రెడ్డి
మధిర మార్చి 17 ప్రజా పాలన ప్రతినిధిఅధికార టీఆర్ఎస్ పార్టీలో ముఖ్య నాయకు నీ గా తన భార్య మున్సిపల్ వైస్ చైర్ పర్సన్గా ఉన్నప్పటికీ పార్టీలో కొనసాగుతున్న నిర్లక్ష్యపు అవమానకర పరిస్థితులతో తాను ఆందోళనకు గురిఆయ్యాయని మధిర లో  భరత్ విద్యాసంస్థల అధినేత టిఆర్ఎస్ నాయకులు శీలం వెంకట్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.. మున్సిపల్ చైర్ పర్సన్ గా ఉన్న తన భార్య కు సంబంధించి కానీ తనకు గాని సముచితమైన గౌరవం ఇవ్వడం లేదని కొంతమంది ముఖ్యనాయకులు వారి అనుచరులకు మాత్రమే ప్రాధాన్యత కల్పిస్తూ అన్నింటా వారికే  అగ్రతాంబూలం అన్న రీతిలో పార్టీలో పరిస్థితులు కొనసాగుతున్నాయని అన్నారు మున్సిపాలిటీలో వార్డుల వారీగా పనుల కేటాయింపుల్లో వివక్ష చూపుతున్నారని తాను నివాసం ఉంటున్న ప్రాంతంలో చేపడుతున్న పనుల విషయంలో కూడా తనకు సమాచారం లేకపోవడం మున్సిపల్ చైర్ పర్సన్ వ్యక్తిగతంగా తనకు నచ్చిన వారికి కాంట్రాక్టు ఇచ్చుకుంటూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శలు చేశారు ప్రతిపక్ష పార్టీలకు చెందిన కౌన్సిలర్ ల కు ఇచ్చే గౌరవం కూడా తమకు దక్కకపోవడం పార్టీ కార్యకలాపాల్లో కూడా తమకు సమాచారం ఇవ్వకుండా తమ ప్రాతినిధ్యం లేకుండానే కార్యక్రమాలు నిర్వహించుకుంటూ నామమాత్రపు గౌరవాలను ప్రదర్శిస్తున్నారని ఈ వివక్షపై నియోజకవర్గ ఇన్చార్జి లింగాల కమల్ రాజు కు, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు ,మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కి పలుమార్లు ఈ విషయాన్ని వెల్లడించా నాని అయినప్పటికీ తమ పట్ల జరుగుతున్న వివక్ష లో మార్పు లేదని శీలం వెంకట రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు మున్సిపాలిటీ కి చెందిన వైస్ చైర్ పర్సన్ హోదాలో ఉన్న తన ఇంటి వైపుకు కనీసం పారిశుద్ధ్య కార్మి  కానీ చెత్త ఎత్తుకుపోయే ట్రాక్టర్లు గాని రావని ఇంతకంటే దౌర్భాగ్యం ఏమైనా ఉంటుం దా అని ఆయన పేర్కొన్నారు తనకు పార్టీ అప్పగించిన బాధ్యతల నేపథ్యంలో మడుపల్లి లోని మూడు వార్డుల్లో తనతో పాటు మరో ఇరువురు వార్డు కౌన్సిలర్ గెలుపు కు తన వంతు బాధ్యతగా కృషి చేసి సమన్వయంతో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకు వెళ్తున్నాము అని ఆయన పేర్కొన్నారు తన లో గత కొద్ది కాలంగా పార్టీ కార్యకలాపాల్లో మున్సిపాలిటీ వ్యవహారాల్లో వెల్లడవుతున్న అనేక అవమానకర సంఘటనలు అంతర్గతంగా మనోవేదనకు గురి చేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు వైయస్సార్ కుటుంబం తో తనకున్న సంబంధాల నేపథ్యంలో తాను షర్మిలను మర్యాదపూర్వకంగా కలిసినట్లు పేర్కొన్న ఆయన తాము టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదని వెల్లడించారు రాజకీయాల ద్వారా ప్రజా సేవ చేయాలనుకున్నానని అంతే తప్ప రాజకీయాలను వాడుకొని డబ్బులు సంపాదించుకోవాలని తాను అనుకోవడం లేదన్నారు సముచిత స్థానం గౌరవం కోసమే తాను ఆలోచిస్తానని శీలం వెంకట రెడ్డి పేర్కొన్నారు