నేల మరియు నీటి సంరక్షణ, యాజమాన్య పద్ధతుల పై రైతులకు ఒక రోజు క్షేత్రస్థాయి శిక్షణ..

Published: Wednesday October 06, 2021
పాలేరు అక్టోబర్ 5 ప్రజా పాలన ప్రతినిధి : కూసుమంచి మండలం రైతు వేదిక లో ఈరోజు జరిగిన నేల మరియు నీటి సంరక్షణ, యాజమాన్య పద్ధతుల పై రైతులకు ఒక రోజు క్షేత్రస్థాయి శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న డి సి సి బి డైరెక్టర్ మాట్లాడుతూ రైతులను యాజమాన్య పద్ధతిలో పంటలు వేసుకోవాలి గతంలో పత్తి 80% చేసేవాళ్ళు కానీ ఇప్పుడు గులాబీ రంగు పురుగు రావడం వల్ల 20 పర్సెంట్ కూడా వేయలేకపోతున్నారు దీనికి కారణం గులాబి రంగు పురుగు  రైతులకు వారు ఆశించినంత దిగుబడి రావట్లేదని అందువలన వేరే పంటలు వేసుకోవాలి అన్ని ఇబ్బందిగా వుంది కాబట్టి ఎకరానికి 20కింటలు దిగుబడి వచ్చేది కానీ ఎకరానికి పత్తి 3, 4 కింట్టాలు కూడా కావట్లేదని రైతుల గురించి రైతులు ఉద్దేశించి మాట్లాడారు భక్త రామదాసు కాలువల ద్వారా వరి పొలాలు ఇతరేతర పాటలు వేసుకోవాలి రైతుకి లాభం చేకూర్చే పంటలు మాత్రమే వేసుకోవాలి అని రైతులను ఉద్దేశించి మాట్లాడారు డీసీసీబీ డైరెక్ట్ ఇంటూరి శేఖర్ గారు, MPP బానోత్ శ్రీనివాస్ నాయక్, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు బానోత్ రామ్ కుమార్ నాయక్ జె డి ఎ రవిచందర్ శాస్త్రవేత్త హేమంత్ కుమార్ ఏవో, ఏ ఈ ఓ లు వివిధ గ్రామాల నుంచి వచ్చిన రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు