బహుజన బతుకమ్మ గోడ పత్రిక విడుదల

Published: Thursday October 07, 2021
రాష్ట్ర రైతు సంఘం సమితి అధ్యక్షుడు పి.నాగిరెడ్డి
వికారాబాద్ బ్యూరో 06 అక్టోబర్ ప్రజాపాలన : ప్రకృతి వ్యవసాయంతోనే బతుకమ్మకు సద్దులంటూ బహుజన బతుకమ్మను నిరంతర ఉద్యమంగా కొనసాగిద్దామని రాష్ట్ర రైతు సంఘం సమితి అధ్యక్షుడు పి.నాగిరెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఆర్డిఓ కార్యాలయం ముందు భాగంలో బహుజన బతుకమ్మ గోడ పత్రికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంచభూతాలను అమ్ముకునే బహుళజాతి కంపెనీలను నిరసిద్ధామని డిమాండ్ చేశారు. పంచభూతాలను నమ్ముకొని జీవిస్తున్న బహుజనులను ఆహ్వానిద్దామని హితవు పలికారు. ప్రకృతి పర్యావరణం ప్రత్యామ్నాయ ప్రజా సంస్కృతి అనే అంశాలను కేంద్ర బిందువుగా చేసుకుని బహుజన బతుకమ్మను ఉద్యమంగా కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. 2021 నాటికి తెలంగాణ సాంస్కృతిక పునాదులపై సాగిన రాష్ట్ర సాధన ఉద్యమంలో 10 ఏళ్లకు ముందే బతుకమ్మను ఉద్యమ సాధారణంగా మనం ఉన్నామని స్పష్టం చేశారు. జన జీవితాలతో పాటు ప్రజల ఆహార సంస్కృతిని ఆట పాట మాటలను కబళించిన వలస అంతర్గత పాలన నుండి సంపూర్ణమైన అభివృద్ధి సాధించే వరకు ఉత్సవమే కాదని ఉద్యమం అంటూ ముందుకు సాగుతున్నామని చెప్పారు. భూస్వామ్య సామ్రాజ్యవాద దోపిడీ పీడనల మూలంగా దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న వ్యవసాయ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు రవికుమార్, రాష్ట్ర కార్యదర్శి ఎస్.రత్నం, ఆంజనేయులు, దర్శన్, సంతోషమ్మ, సుదర్శన్, సాయన్న తదితరులు పాల్గొన్నారు.