ప్రజా సంక్షేమమే బిఆర్ఎస్ పార్టీ ధ్యేయం అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట పార్టీకి కార్యకర్

Published: Saturday December 03, 2022
బూర్గంపాడు ( ప్రజా పాలన.)
 
 నిత్యం ప్రజల మధ్య ఉంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా ప్రభుత్వ పథకాలను ప్రజలకు గ్రామాలలోని వివరించాలని, పినపాక నియోజకవర్గం  బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పార్టీ బాధ్యులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ రేగా కాంతారావు  సూచించారు .ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు  మాట్లాడుతూ దేశంలోనే ఎక్కడైనా విధంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను గురించి ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకు వెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలదే అని అన్నారు, రాష్ట్రంలో బిఆర్ఎస్  ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుకున్న వారిని నేరుగా కలిసేలా ప్రణాళికలు రూపొందించాలని సీఎం కేసీఆర్  ఆదేశించారన్నారు, కేవలం ఎన్నికలు వచ్చినప్పుడే ప్రతిపక్ష పార్టీలు ప్రజల వద్దకు వస్తూ ఉంటారని,  పార్టీ మాత్రం ఎల్లవేళలా ప్రజలలో ఉంటూ వారి కష్టసుఖాలలో పాలుపంచుకుంటుంది అన్నారు,  పార్టీకి కార్యకర్తల బలమని కార్యకర్తల కృషితోనే తెలంగాణ ఏర్పాటుతోపాటు అధికారం దక్కించుకున్న దన్నారు, నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రభుత్వ పథకాలు వారికి పకడ్బందీగా అందేలా కృషి చేయాలని సూచించారు, పార్టీ ప్రజాప్రతిథులు, నాయకులు, పార్టీ బాధ్యులు ముఖ్యులంతా నిత్యం నియోజకవర్గంలోని ప్రజలకు అందుబాటులో ఉంటూ సంక్షేమ అభివృద్ధి ఫలాలను చేరవేయాలి అన్నారు, అన్ని గ్రామాలలో పార్టీ నిర్మాణం దృఢంగా ఉండేలా పార్టీలోని అన్ని భాగాలు సమన్వయంతో పని చేయాలని సూచించారు, గ్రామాల వారిగా ప్రభుత్వ పథకాలు పొందుతున్న లబ్ధిదారుల జాబితాను రూపొందించుకోవాలన్నారు, వచ్చే ఎన్నికలలో బిఆర్ఎస్  పార్టీ 100 సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు, పినపాక నియోజకవర్గం వ్యాప్తంగా అనేక అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు,పినపాక నియోజకవర్గం లోని సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు ట్విట్టర్ ఇంస్టాగ్రామ్ ఫేస్బుక్ వాట్సప్ లాంటి వాటిని పూర్తిస్థాయిలో వినియోగించుకొని ప్రభుత్వ పథకాలను అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేయాలని వారు సూచించారు, గ్రామం నుండి సోషల్ మీడియాలో బాలోపేతానికి ప్రతి  ఒక్కరు సైనికుల పనిచేయాలన్నారు, తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత ప్రతి సోషల్ మీడియా వారియర్స్ పై ఉన్నదని ఆయన అన్నారు, పార్టీ చేపట్టే కార్యక్రమాల ప్రచారాల్లో సోషల్ మీడియా ఉత్సాహంగా పనిచేయాల్సిన అవసరం ఉందని సూచించారు, సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అవసరమయ్యేలా వివరించాలన్నారు,పినపాక నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శ నియోజక వర్గంగా తీర్చిదిద్దుతానని అన్నారు, నియోజకవర్గం లోని సీఎం కేసీఆర్ , మంత్రి కేటీఆర్  నాయకత్వంలో నిధులకు కొరత లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు, రానున్న రోజులలో మరింత అభివృద్ధి పథంలో నిలబెడతానని అన్ని గ్రామాలలో డ్రైన్లు సిసి రోడ్ల నిర్మాణ పనులను పూర్తి చేస్తామన్నారు, పనులను పూర్తి చేసినందుకు ప్రభుత్వం అవసరమైన నిధులు అందజేస్తుందని, కోట్లాది రూపాయలు నిధులు ప్రభుత్వం నుంచి మంజూరు అవుతున్నాయని వారు తెలియజేశారు, ప్రతి ఏజెన్సీ గ్రామానికి బీటీ రోడ్లు నిర్మాణం చేపట్టడం జరిగింది అన్నారు, ఇంకా మిగిలిపోయినటువంటి అభివృద్ధి కార్యక్రమాల ను త్వరలోనే పూర్తి చేస్తామన్నారు, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కోట్లాది రూపాయలు నిధులను వెచ్చించి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉస్తానని అన్నారు.