గ్రామ వారసత్వ సంపదను అన్యాక్రాంతం కానివ్వం* *ఎంపీపీ కృపేష్

Published: Tuesday July 26, 2022

ఇబ్రహీంపట్నం జూలై తేదీ 25 ప్రజాపాలన ప్రతినిధిఈరోజు ఇబ్రహీంపట్నం మండలం పోచారం గ్రామంలోని గడికోట బురుజు కబ్జా చేశారని ఇబ్రహీంపట్నం ఎంపీపీ పి.కృపేష్ పై కేసు పెట్టి సోషల్ మీడియాలో వైరల్ చేశారు.

ఇదే విషయాన్ని గ్రామ పెద్దలతో కలిసి పోచారం గ్రామంలో బురుజు గడికోట లో విలేకరుల సమావేశంలో ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కృపేష్ మాట్లాడుతూ గడికోట అనేది పోచారం గ్రామ ప్రజలు వారసత్వ సంపదని వందల సంవత్సరాల నుండి దీని కాపాడుకుంటున్న సంపద గతంలో కొందరు దుండగులు దీనికి దొంగ సర్టిఫికెట్లు సృష్టించి కబ్జాలకు గురిచేస్తున్నారని తెలుసుకొని గ్రామ పెద్దలతో కలిసి దాన్ని ఆపడం జరిగింది. అదేవిధంగా మే 10 2021 రోజున గ్రామం లో పర్యటించిన పురావస్తు శాఖ అధికారులు ప్రజల నుంచి సేకరించిన వివరాలు తో పాటు స్థలాన్ని పరిశీలించారు. పురాతన శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాములు నాయక్ మరియు తాసిల్దార్ వెంకటేశ్వర్లు ఎంపీడీవో మహేష్ బాబు కలిసి వందల ఏళ్ల చరిత్ర కలిగిన బురుజు స్థలాన్ని కబ్జా చేయాలని చూస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇది ముమ్మాటికీ గ్రామ కంఠం భూమి అని తేల్చి గ్రామ అవసరాల కోసం ప్రజల సహకారంతో ఈ భూమిని వినియోగించుకోవాలని తేల్చి చెప్పడం జరిగింది. గ్రామ అభి వృద్ధి కోసం పాటుపడుతున్న నాపై దుష్ప్రచారం చేస్తూ కొందరి ప్రోద్బలంతో రాజకీయంగా దెబ్బతీయాలని కొందరు భూఆక్రమణ దారులు కేసు పెట్టారని విచారణ జరిపి వెంటనే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కృపేష్ తెలిపారు గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు