తల్లాడ, అక్టోబర్ 17 (ప్రజా పాలన న్యూస్): మెకానికుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా తల్లాడ పట్టణాని

Published: Tuesday October 18, 2022
తల్లాడ, అక్టోబర్ 17 (ప్రజా పాలన న్యూస్):
మెకానికుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా తల్లాడ పట్టణానికి చెందిన షేక్ మదీనా ఆటోమొబైల్ షాప్ అధినేత షేక్ మస్తాన్ ఎన్నికయ్యారు. సోమవారం సిద్దిపేటలో జరిగిన సమావేశంలో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మెకానిక్ లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. తనపై నమ్మకం ఉంచి ఈ పదవికి ఎంపిక చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.