నడవని విద్యా సంస్థలకు ఫీజులు ఎందుకు కట్టాలి.?

Published: Tuesday March 30, 2021

చెల్లించిన ఫీజులను వెంటనే వాపస్ చేయకుంటే కోర్టు కెలతాం కొండబత్తిని రామ్మోహన్.
బెల్లంపల్లి, మార్చి 29, ప్రజాపాలన ప్రతినిధి : రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ విద్యా సంస్థలతో మిలాఖత్ అయి ఫీజుల వసూళ్ల కోసమే కాలేజీలు, స్కూల్లు, కోచింగ్ సెంటర్లు, కేవలం రెండు నెలలు నడిపించి కోట్లాది రూపాయల ఫీజులు వసూళ్లు చేశాయని వసూళ్లు ఐన తరువాత కరోన పేరుతో విద్యా సంస్థల్ని బందు పెట్టిస్తూ నాటకమాడుతున్నారని బే శరత్ గా వసూలు చేసిన ఫీజులను తిరిగి వాపస్ ఇవ్వాలని కాంగ్రెస్ నాయకుడు రాష్ట్ర బీ సి సంక్షేమ సంఘం కార్యదర్శి కొండబత్తిని రామ్మోహన్ డిమాండ్ చేశాడు. సోమవారం ఒక పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  పిల్లలు బాగా చదువుకొని ఉన్నత చదువులు చదువు కోవాలని కూలినాలి చేసి ప్రయివేటు ఉద్యోగాలు చేస్తూ, పొలాలు, గృహలు, చివరకు పుస్తెలమ్ముకొని, ఫీజులు చెల్లిస్తే తీరా విద్యా సంస్టల్ని బందుపెడితే ఎలా అని ప్రశ్నించారు. ముందే పీజులు వసూలు చేయకుండా ఈ విద్యా సంవత్సరాన్నీ జీరో సంవత్సరం గా ప్రకటిస్తే విద్యార్థుల తల్లిదండ్రులకు ఊరట గా ఉండేదని అన్నారు. ఎలాగు కాలేజీలు, స్కూల్స్, కోచింగ్ సెంటర్లు, హాస్టల్స్, నడవవు కాబట్టి పోటీ  పరీక్షల కోచింగ్ల కోసం చెల్లించిన కోట్లాది రూపాయలను తిరిగి చెల్లించాలని లేదంటే విద్యార్థుల తల్లిదండ్రులను రాష్ర్ట ప్రభుత్వం మోసం చేసినట్లుగా భావించి కోర్టుకు వెళ్తామని అన్నారు.