బతుకమ్మ పండుగా తెలంగాణ ఆడబిడ్డలందరికీ ఆనందం

Published: Thursday October 07, 2021
బాలాపూర్: అక్టోబర్ 06, ప్రజాపాలన ప్రతినిధి : తెలంగాణ ఆడబిడ్డలందరికీ తీరొక్క పువ్వుల తెలంగాణ పండగ, తెలంగాణ సంస్కృతి చిహ్నంగా నిలిచే ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేసిన కార్పొరేషన్ మేయర్. బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నాదరుగుల్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి పాల్గొని ఆమె చేతుల మీదగా  బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..... ప్రజలందరికీ ఎంగిలి పువ్వు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ ఆడబిడ్డ లందరికీ తీరొక్క పూలతో భక్తిశ్రద్ధలతో పూజించే బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి చిహ్నంగా భావిస్తారనీ అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ చిగురింత నరసింహారెడ్డి, కార్పొరేషన్ స్థానిక కార్పొరేటర్ల్ తోట శ్రీధర్ రెడ్డి, నిమ్మల సునీత శ్రీకాంత్ గౌడ్, గుడెపు ఇంద్రసేన, రామోజీ అమిత శ్రీశైలం చారి, కోఆప్షన్ సభ్యుడు జగన్మోహన్ రెడ్డి నాయకులు, కార్యకర్తలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.