రాయితీ రుణాల కొరకు దరఖాస్తుల స్వీకరణ . జిల్లా అల్ప సంఖ్యాక సంక్షేమశాఖ అధికారి నీరటి రాజేశ్వ

Published: Friday January 06, 2023
మంచిర్యాల బ్యూరో,  జనవరి 5, ప్రజాపాలన :
 
రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ (టి.ఎస్.ఎం.ఎఫ్.సి.) ఆర్థిక సహాయ పథకం / బ్యాంక్ లింక్డ్ రాయితీ పథకం మైనార్టీ కేటగిరీ-1 & 2 కొరకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022-23లో రాష్ట్రంలోని ముస్లింలు, సిక్కులు, పార్శీలు, బౌద్ధులు, జైనులకు రాయితీ ద్వారా ఆర్థిక సహాయం అందించడం కోసం ఆన్లైన్ దరఖాస్తు తేదీని ఈ నెల 9 వరకు పొడిగించినట్లు జిల్లా అల్ప సంఖ్యాక సంక్షేమశాఖ అధికారి నీరటి రాజేశ్వరి ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుదారు మైనార్టీ కమ్యూనిటీకి చెందిన వారై ఉండాలని, 21-55 సం॥ల మధ్య వయస్సు ఉండాలని, కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల వారికి 1 లక్షా 50 వేల రూపాయలు, పట్టణ ప్రాంతాల వారికి 2 లక్షల రూపాయల లోపు ఉండాలని, ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డు / ఆహార భద్రత కార్డు కలిగి ఉండాలని, ఆన్లైన్లో OBMMS వెబ్పైర్టల్లో https://tsobmms.cgg.gov.in లేదా TSMFC వెబ్సైట్ tsmfc.in ద్వారా దరఖాస్తు చేసుకొని ఈ నెల 9వ తేదీ లోగా దరఖాస్తులను సంబంధి మండల పరిషత్ కార్యాలయము, కమీషనర్, పురపాలక సంఘాలలో సమర్పించాలని, ఆసక్తి, అర్హత గల వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.