వసంతమ్మ మానసిక వికలాంగ సేవాసదనం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుక లు మధిర రూరల్

Published: Saturday September 03, 2022
సెప్టెంబర్ 2 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు వసంతమ్మ మానసకు వికలాంగుల సేవాసదనములు ఘనంగా నిర్వహించారు విద్యార్థులకు శుక్రవారం జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని బేవర మురళీకృష్ణ ఆధ్వర్యంలో పండ్లు పంపిణీ చేశారు. అదేవిధంగా జనసేన యూత్ నాయకుడు అనంత శివరామకృష్ణ ఆధ్వర్యంలో విద్యార్థులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సేవలను కొనియాడారు. ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంతో అష్టైశ్వర్యాలతో ఉండి సమాజానికి సేవ చేయాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో జన సైనికులు కోట సాయి వీరబాబు పవన్, అన్నెం ఖుషి, ధని శెట్టి అభి, తోట సాయి తదితరులు పాల్గొన్నారు.