ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు చేయాలి

Published: Tuesday August 23, 2022

మంచిర్యాల టౌన్, ఆగష్టు 22, ప్రజాపాలన :  మంచిర్యాల జిల్లా, నెన్నెల్ మండలం , పెద్ద లంబాడి తండా గ్రామానికి చెందిన పేద గిరిజన మహిళ ధరావత్ రుక్మి అనే గిరిజన మహిళను ఎక్సైజ్ పోలీసులు కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి, మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను సామాజిక కార్యకర్త మేదరి రాకేష్ సోమవారం రోజున పరామర్శించరు. ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్సైజ్ పోలీసులు ఇంట్లో ఎవరూ లేని సమయంలో చొరబడి మూకుమ్మడిగా దాడి చేసారని, ఇంట్లో  గుడుంబా ఉండి ఉంటే కేసు రిజిస్టర్ చేసి, చట్ట ప్రకారం నడుచుకోవాలి కానీ మహిళ అని కూడా చూడకుండా ఇంత విచక్షణారహితంగా కొట్టడం సరి కాదన్నారు.   వెంటనే ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ 1989 పి ఒ ఎ యాక్ట్ తాజా మార్గదర్శకాల ప్రకారం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.లేని యెడల  ఆందోళన కార్యక్రమాలు చేస్తాం అని హెచ్చరించారు.