అంతత్వాన్ని నివారించడమే లక్ష్యం

Published: Saturday January 21, 2023
* విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
వికారాబాద్ బ్యూరో 20 జనవరి ప్రజా పాలన : అంతత్వాన్ని నివారించడమైన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం నవపేట్ మండల కేంద్రంలోని రైతు వేదిక ప్రాంగణంలో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాన్ని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య నవపేట్ గ్రామ సర్పంచ్ విజయలక్ష్మి రా ప్రకాష్ ఎంపీటీసీ కొండ పద్మ నాగిరెడ్డి లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి  కళ్ళద్దాలు పంపిణీ చేసారు. కంటి వెలుగు శిబిరాన్ని సందర్శింస్తున్న సందర్భంగా ముందుగా నవాబ్ పేట్ మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ నిఖిల కంటి పరీక్షలు నిర్వహిస్తున్న విధానంతో పాటు వివిధ సౌకర్యాలపై వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు.  అదేవిధంగా కంటి పరీక్షలు చేయించుకుంటున్న వారిని కలెక్టర్ ఆప్యాయంగా పలకరించారు. మంత్రి సందర్శన కార్యక్రమంలో వికారాబాద్ ఆర్టీవో విజయ కుమారి,  జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి పాల్వన్ కుమార్ , తాసిల్దార్ రవీందర్, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.