కోవిడ్ స్పెషల్ వాక్సినేషన్ డ్రైవ్ ను పర్యవేక్షించిన నాయకులు అధికారులు

Published: Friday September 17, 2021
బీరుపూర్, సెప్టెంబర్ 16 (ప్రజాపాలన ప్రతినిధి): బీరుపూర్ మండలంలోని తుంగూర్ బీరుపూర్ కొల్వాయి తాళ్లదర్మారం మరియు మంగేల ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలలో కోవిడ్ స్పెషల్ వాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించడంతో నాయకులు అధికారులు పర్యవేక్షించారు. 18 సంవత్సరాలు పైబడిన వారందరు ఆధార్ కార్డ్ మరియు ఫోన్ నెంబర్ తో వెళ్లి తమ పేరును నమోదు చేసుకొని వాక్సిన్ తప్పకుండ వేసుకోవలసిందిగా సూచించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మసర్తి రమేష్ జడ్పీటీసీ పాత పద్మరమేష్ వైస్ ఎంపీపీ బలుమురి లక్ష్మణ్ రావు ఎంపీడీఓ మల్లారెడ్డి ఎంపీవో రామక్రిష్ణరాజు సర్పంచులు చుంచు శారద ఏసుదాసు గుడిసె శ్రీమతి నల్ల మహిపాల్ రెడ్డి గర్షకుర్తి శిల్ప ఉప సర్పంచులు వార్డ్ మెంబెర్స్ మెడికల్ సిబ్బంది ఏఎన్ఎంలు ఆశ వర్కర్స్ పంచాయతీ కార్యదర్శులు మరియు పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.