ఇబ్రహీంపట్నం మార్చి తేదీ 10 ప్రజాపాలన ప్రతినిధి *ఘనంగా టీయూడబ్ల్యూజే నియోజకవర్గ అధ్యక్షుడు

Published: Saturday March 11, 2023

  టియుడబ్ల్యూజే (143) నియోజకవర్గ అధ్యక్షుడు, సీనియర్ TV5 రిపోర్టర్ సురమోని సత్యనారాయణ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం యాచారం మండల కేంద్రంలో జర్నలిస్టు సోదరుల సమక్షంలో కేక్ కట్ చేసి శాలువాలతో ఘనంగా సన్మానించి, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అనంతరం నల్గొండ జిల్లా చందంపేట మండలం దేవరచర్ల గ్రామంలో కొండపై కొలువై ఉన్న అతి పురాతన ముని శివాలయానికి  వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించి, జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు మక్కపల్లి శ్రీనివాస్, చెరుకూరి మల్లేష్, పంబల అంజనేయులు, గుండెబోయిన రాఘవేందర్, పగడాల  నరేందర్ రెడ్డి, మల్కాపురం శివ, గూడెల్లివెంకటయ్య ఏడుకొండల్, పసునూరు వెంకటేష్, సూరంపల్లి హరిదాస్ గునమొని శివ, రామ్ చందర్, నాగేష్, అనిల్,  తదితరులు ఉన్నారు.