సీతారామచంద్ర స్వామి గుడికి సీసీ కెమెరాలను అందజేసిన మేకల భాస్కర్ రెడ్డి

Published: Friday April 23, 2021
మేడిపల్లి, ఏప్రిల్ 22 (ప్రజాపాలన ప్రతినిధి) : ఉప్పల్ బీరప్పగడ్డలోని సీతారామచంద్ర స్వామి గుడికి ఉప్పల్ మున్సిపల్ మాజీ చైర్మన్ మేకల శివారెడ్డి కుమారుడు మేకల భాస్కర్ రెడ్డి సీసీ కెమెరాలను అందజేశారు. శ్రీరామనవమిని పురస్కరించుకొని గుడిలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న భాస్కర్ రెడ్డి అనంతరం గుడి కమిటీ సభ్యులతో కలిసి సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మేకల భాస్కర్ రెడ్డిని గుడి కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గుడి చైర్మన్ మేకల శివా రెడ్డి, నేర్థం భాస్కర్ గౌడ్, ఆగం రెడ్డి, పండ్ల కిషన్ గౌడ్, మల్లేష్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు