రోడ్డెక్కిన రైతులు ..వరిదాన్యం తో మండల కేంద్రం లో రాస్తారోకో. - తూకంలో మెుసానికి పాల్పడిన వార

Published: Tuesday May 17, 2022
జన్నారం రూరల్, మే 16, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండల దాన్యం కోనుగోలు నిర్వాహకులు చేస్తున్న కేంద్రలపై రైతులు కన్ను ఎర్ర చేశారు, కోనుగోలు కేంద్రలలో రైతులు నుంచి అదనంగా దోచుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని రైతులకు న్యాయం చేయాలని తపాలపూర్ చెక్ పోస్ట్ వద్ద తపాలపూర్ మహమ్మదాబాద్ రోటిగూడ తిమ్మాపూర్ గ్రామాల రైతులు సోమవారం రస్తారోక చేశారు, రెండు గంటల పాటు వరి దాన్యంతో రోడ్డు పై బైటహించి నిరసన తెలిపారు, రస్తారోకతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి, ఈ సమాచారం తెలుసుకున్న జన్నారం తహసీల్దార్ కిషన్, స్థానిక ఎస్ఐ సతీష్ సంఘటన స్థలానికి చేరుకుని రైతులకు నచ్చచేప్పారు, రైతులు న్యాయం జరిగే వరకు రస్తారోక విరమించేదిలేదని తెలిపారు, తహసీల్దార్ ఎక్కువ కోనుగోలు రెండు కిలోల నుంచి ఐదు కిలోల వరకు తూకం వేస్తే చర్యలు తీసుకుంటున్నామని హమీ ఇవ్వడంతో రైతులు రస్తారోక విరమించారు,ఈ సమాచారం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి తపాలపూర్ గ్రామంలో పర్యటించారు, వరి దాన్యం కేంద్రలలో నాలుపై కిలోల కంటే ఎక్కువ తూకం వేస్తే చర్యలు తీసుకుంటున్నామని హెచ్చరించారు, ఈ సందర్భంగా  పలువురు రైతులు మాట్లాడుతూ చింతగూడ వ్యవసాయ సహకార సంఘం పరిదిలో కోనుగోలు కేంద్రాలు రైతులను మెుసం చేస్తూ ఒక్కో బస్తాకు రెండు నుండి ఐదు కిలోల వరకు వరి దాన్యం తూకంలో ఎక్కువగా తీసుకుంటున్నారని అరోపించ్చారు, ఈ కార్యక్రమంలో మండల తాహసిల్థార్ కిషన్, స్థానిక ఎస్ఐ సతీష్, సహకార సంఘం  వైస్ చైర్మన్ విజయ దర్మా, సిఇఓ డైరెక్టర్, రైతులు, పాల్గొన్నారు.