సిపిఐ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి

Published: Tuesday August 02, 2022

మధిర రూరల్ ఆగస్టు 1 ప్రజా పాలన ప్రతినిధి భారత కమ్యూనిస్టు పార్టీ  ఖమ్మం జిల్లా 22వ మహాసభలను విజయవంతం చేయాలని సిపిఐ మండల పట్టణ కార్యదర్శి ఓట్ల కొండలరావు బెజవాడ రవిబాబు కోరారు. మహాసభలకు సంబంధించిన గోడపత్రికలను సోమవారం వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆగస్టు 5,6,7వ తేదీల్లో వైరాలో సిపిఐ ఖమ్మం జిల్లా మహాసభలను నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.1925 డిసెంబర్ 26న కాన్పూర్ లో సిపిఐ ఆవిర్భవించిందని నాటి నుండి నేటి వరకు భారత దేశ వ్యాప్తంగా సిపిఐ అనేక ప్రజాపోరాటాలు నిర్వహించి ప్రజాస్వామ్య, రాజ్యాంగ పరిరక్షణ కోసం నిరంతరం పోరాటాలు నిర్వహిస్తున్న పార్టీ సిపిఐ అన్నారు. ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి గ్రామస్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడం కోసం కార్యక్రమాల రూపకల్పన కోసం అన్ని స్థాయిల్లో మహాసభలను జరుపుకొని కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న పాలకుల ప్రజావ్యతిరేక విధానాలపై మరిన్ని ప్రజా పోరాటాలు నిర్వహించడానికి సిపిఐ శ్రేణులు సిద్ధం అవుతారని వారు తెలిపారు.ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా సిపిఐ 22వ మహాసభలు వైరాలో ఆగస్టు 5,6,7వ తేదీల్లో మహాసభలు నిర్వహిస్తున్నట్లు ఈ మహాసభను విజయవంతం కోసం సిపిఐ పార్టీ నాయకత్వం, కార్యకర్తలు సిద్ధం కావాలని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మండల పట్టణ సహాయ కార్యదర్శి చావా మురళీకృష్ణ మంగళగిరి రామానుజన్ సిపిఐ జిల్లా సమితి సభ్యులు పెరుమలపల్లి ప్రకాష్ రావు పంగ శేషగిరిరావు,వుట్ల కామేశ్వరరావు, తలారి రమేష్, చెరుకూరి వెంకటేశ్వరరావు షేక్ కొండ, శిలువేరు శ్రీనివాసరావు, కొండూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.