జిల్లా కార్యదర్శి చింతకింది రంజిత్ జన్మదిన ఉత్సాహాల లో పాల్గొన్న కాంగ్రెస్ నేతలు

Published: Wednesday June 23, 2021
బాలపూర్, జూన్ 22, ప్రజాపాలన ప్రతినిధి : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగులకు  పూర్తిగా అన్యాయం చేస్తున్నారని, మహేశ్వరం నియోజకవర్గ సీనియర్ నాయకుడు కాంగ్రెస్ పార్టీ దేప భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. సరూర్నగర్ డివిజన్లోని చెరుకు తోట కాలనీలో కమ్యూనిటీ హాల్ లో  జిల్లా ఎన్. ఎస్ యు ఐ కార్యదర్శి చింతకింద రంజిత్ జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరాన్ని రాష్ట్ర యువజన నాయకులు నల్లెంకి ధన్ రాజ్ గౌడ్ తో కలిసి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దేప భాస్కర్ రెడ్డి లు ప్రారంభించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ..... చింతకింది రంజిత్తో కేక్ కట్ చేసి, శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. రక్త దానం చేసిన యువకులను అభినందించారు. ఇలాంటి సేవ కార్యక్రమాలు మరిన్ని చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఇంటికో ఉద్యోగం అని చెప్పి యువకులను మోసం చేసిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో యువకులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గద్దె దింపడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ కన్వీనర్ బండి మధుసూదన్ రావ్, చిక్కుళ్ల శివ ప్రసాద్, శేఖర్ ముదిరాజ్, అల్లేటి కిరణ్ కుమార్, వినోద్ చారి, సంతోష్, భాస్కర్ ఎన్ ఎస్ యు  నాయకులు తదితరులు పాల్గొన్నారు.