ప్రపంచ మత్స్య దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసిన – నవ సమాజ్ పార్టీ అధ్యక్షుడు ఊదరగొండి చంద్

Published: Monday November 22, 2021

ప్రపంచ మత్స్యకార సంఘాలు ప్రతి సంవత్సరం నవంబర్ 21న ప్రపంచ మత్స్య దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల ఆహారంలో చేపలు ముఖ్యమైన భాగంగా ఉన్నాయి. ముఖ్యంగా నది తీరాలు మరియు ఇతర నీటి వనరుల సమీపంలో నివసించేవి. ఇది ఆరోగ్యకరమైన మహా సముద్రాల పర్యావరణ వ్యవస్థ యొక్క ప్రాముఖ్యత మరియు ప్రపంచంలోని మత్స్య సంపద యొక్క స్థిరమైన నిల్వలను నిర్ధారించడానికి నిర్ధారణ చేస్తుంది. ఇది 1997లో ప్రారంభించబడింది. 'వరల్డ్ ఫోరమ్ ఆఫ్ ఫిష్ హార్వెస్టర్స్ & ఫిష్ వర్కర్స్' న్యూ ఢిల్లీ లో సమావేశమై 18 దేశాల ప్రతినిధులతో 'వరల్డ్ ఫిషరీస్ ఫోరమ్' ఏర్పాటుకు దారి తీసింది మరియు స్థిరమైన ఫిషింగ్ పద్ధతుల యొక్క ప్రపంచ ఆదేశాన్ని సమర్ధించే ప్రకటనపై సంతకం చేసిందని తెలుస్తుంది ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన నవ సమాజ్ పార్టీ అధ్యక్షుడు ఊదరగొండి చంద్రమౌళి. మత్స్యకారుల గురించి దేశ ప్రధాని మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి బహిరంగ లేఖను విడుదల చేశారు. ఈ లేఖలోని సారాంశం ఏమనగా... దేశంలో సుమారు 65 కోట్ల జనాభా దారిద్ర రేఖకు దిగువన ఉన్న, 25 కోట్ల జనాభా వలస కార్మికులు గా జీవిస్తున్నారన్నారు. ఈ దేశంలో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో మత్స్యకారుల జీవన విధానం చాలా దుర్భర పరిస్థితిలో ఉందన్నారు. వీరి జీవన విధానం చెరువులు, కాలువలు, నదులు మరియు సముద్రంలో చేపలు వేటాడి అమ్మితే వచ్చే డబ్బుతో వీరి కుటుంబాలు పోషించుకోవడం జరుగుతుందన్నారు. గతంలో ఎంతో మంది సముద్రంలో చేపల వేటకు వెళ్లి చనిపోవడం జరిగింది. సుమారు 25 రోజుల నుంచి 30 రోజులు సముద్రంలో భార్య బిడ్డలని విడిచి గడపవలసి ఉంటుందన్నారు. నెల రోజుల తర్వాత నైనా ఇంటికి తిరిగి వస్తాడో! రాడో! తెలియని పరిస్థితి అని అన్నారు. చేపల వేట సమయంలో కొన్ని రాష్ట్రాలు ఒకోసారి దేశాల సరి హద్దులు దాటడం జరుగుతుందన్నారు. ఇలాంటి పరిస్తిలో అక్కడ ఉన్న ప్రభుత్వాలు పట్టుకొని జైళ్ళలో పెట్టడం జరుగుతుందన్నారు. కావున తక్షణమే ఈ వర్గాల వారిని ఆదుకోవాల్సిన బాధ్యత సంబంధిత రాష్ట్ర  మరియు కేంద్ర ప్రభుత్వం మీద ఉందన్నారు. మత్స్యకారుల పేదరికాన్ని నిర్మూలించాలంటే ప్రభుత్వాలకు అనేక మార్గాలు ఉన్నాయన్నారు... కొల్లేరు సరస్సు గురించి అందరికీ తెలిసిన విషయమే ఇది  రెండు జిల్లాల్లో విస్తరించి ఉంది అది కృష్ణ మరియు గోదావరి జిల్లాలు. 1964 సంవత్సరంలో కొల్లేరు సరస్సుకు వరద నీరు ఎక్కువగా రావడం వలన అప్పటి ఇరిగేషన్ అధికారులు 10.07వ కాంటూర్ గా 2,25,000 ఎకరాలు కేటాయించడం జరిగిందన్నారు. తరువాత దీనిని 5వ కాంటూర్ గా 75,100 ఎకరాలకు కుదించడం జరిగిందన్నారు. ఉభయ రాష్ట్రాల ప్రభుత్వ ఆదేశం జి.ఓ., ఎం.ఎస్., సంఖ్య.76, తేదీ. 25.09.1995 మరియు జి.ఓ., సంఖ్య. 120, తేదీ.04.10.1999 ప్రకారం 77,138 ఎకరాలకు కుదించారన్నారు. తదుపరి కొల్లేరు ఫిషర్ మెంట్ డెవలప్మెంట్ సొసైటీలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సుమారు 146 సొసైటీలను ఏర్పాటు చేసి ‘డి’ ఫారం పట్టాలు ద్వారా సుమారు 5496 ఎకరాలు ఎస్సీ, బీసీ మరియు ఎబిసి లకు పంపకం జరిగిందన్నారు. మత్స్యకారులను ఆదుకోవాలని అప్పటి ముఖ్యమంత్రి దివంగత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి నిర్ణయం ప్రకారం 5వ కాంటూర్ నుండి 3వ కాంటూర్ వరకు కుదించి అప్పటి శాసనసభలో తీర్మానం చేయడం జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి గతంలో 5వ కాంటూర్ నుంచి 3వ కాంటూర్ కి కుదించిన అప్పటి శాసనసభ తీర్మానం ప్రకారం మిగిలిన భూమిని అర్హులైన మత్స్యకారులకు పంచాలని సూచించారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మత్స్యకారులను ఆదుకోవాలని పేర్కొన్నారు. అంతే కాకుండా కొల్లేరు సరస్సు లోని 5వ కాంటూర్ లో ఎంతో మంది బడా బాబులు మరియు ప్రజా ప్రతినిధులు లంచాలను తీసుకొంటున్నారన్నారని అభియోగించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా చెరువులు తవ్వించి వ్యాపారం చేయడం మూలంగా అర్హులైన మత్స్యకారులకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రజా ప్రతినిధుల ఆగడాలను అరికట్టి అర్హులైన మత్స్యకారులకు న్యాయం చేయాలని నవ సమాజ్ పార్టీ అధ్యక్షుడు ఊదరగొండి చంద్రమౌళి మత్స్యకారుల తరపున కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు మనవి చేశారు.