125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహా ఏర్పాటుతో తెలంగాణ వైపు చూస్తున్న భారత్. ప్రజాసంఘాల జేఏసీ రా

Published: Monday April 10, 2023
కోరుట్ల, ఏప్రిల్ 09 ( ప్రజాపాలన ప్రతినిధి):
దేశం గర్వించదగ్గ ప్రతిష్టాత్మక 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహాన్ని అ మహానీయుడి జన్మదినోత్సవమైన ఏప్రిల్14 న ఆవిష్కరించనున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతీస్తున్నట్లు తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ కార్యనిర్వాహక కమిటీ రాష్ట్ర అధ్యక్షులు పేట భాస్కర్ తెలిపారు. ఆదివారం హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో నిర్మాణం అవుతున్న సమాసమజ స్వాప్నికుడు,దళిత బహుజన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న బాబాసాహెబ్ బి ఆర్ అంబేద్కర్ గారి విగ్రహా ప్రతిమను, ప్రాంగణాన్ని సిపిఐ రాష్ట్ర నాయకులు చెన్న విశ్వనాథం, గల్ప్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు గుగ్గిల్ల రవితో కలిసి పేట భాస్కర్ సందర్శించారు. ఈసందర్భంగా పేట భాస్కర్ మాట్లాడుతూ తెలంగాణ సచివాలయానికి సైతం డా బి ఆర్ అంబేద్కర్ పేరు పెట్టడంతో పాటు ఇంత భారీ విగ్రహా ఏర్పాటుతో తెలంగాణ వైపు భారత దేశమంతా చూస్తుందని ఇకనైనా కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని, నిర్వీర్యం చేయాలని చూస్తున్న భారత రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు దేశంలోని ప్రతి పౌరుడు సిద్దంగా వుండాలని పేట భాస్కర్ కోరారు. ఈ సందర్శనలో ప్రజాసంఘాల నాయకులు పి నారాయణ, ఎర్దండి సునీల్, దాసరి జగన్,రాంబాబు తదితరులు పాల్గొన్నారు.